Telegram Web
కాలం అమూల్యం "కలయతి ఇతి కాల!' అని కాలానికి నిఘంటువులు నిర్వచనం చెప్పాయి. అంటే అన్నింటినీ తనలో లీనం చేసుకొనేది కాలం. కాలాన్ని గణించాలంటే అత్యంత సూక్ష్మసమయం నుంచి మహాకల్పాల వరకు లెక్కించవలసి వస్తుంది. కాలం అనంతంగా సాగుతూ ఉంటుంది కనుక మనిషి తన పరిధి మేరకే కాలాన్ని లెక్కించగలుగుతాడు. మనిషి ఆయుర్దాయం అనంతకాలంలో చాలా చిన్నది.

గడచిపోయిన క్షణం మళ్ళీ రాదు. రెప్పవాల్సి తెరిచేలోగా కాలం గడచిపోతుంది. కాలంతో పరుగులు తీయడం మనిషికి సాధ్యం కాదు. కాలశక్తిని ఆపడం మనిషితరం కాదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా భూమిపై కొనసాగే పగటివేళలో మనిషి జాగృతుడై జీవన విధానాన్ని దిద్దుకొంటాడు. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా మనిషి నిద్రిస్తాడు. ఇది మానవలోకంలోని కాల నియమం. ఇది భూమికే పరిమితం. భూమిని దాటి ఇతర గ్రహాలకు వెళ్తే అక్కడి కాలమానమే వర్తిస్తుంది.

'కాలం గడిచిపోతున్నది అని ఎవడో అంటే 'ఒరే! వెర్రిబాగులవాడా! గడచిపోతున్నది కాలం కాదురా, నీ ఆయుర్దాయమే' అంటుందట కాలం. నిజమే. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి ఆయువు తరుగుతుందే కానీ పెరగదు కదా! కాలం మార్పును తెస్తుందని గుర్తించడానికి మనిషి బాల్యం నుంచి కౌమారానికి, కౌమారం క్రమంగా యౌవనానికి, మార్పు మనిషి నుంచి ఉదాహరణ. సంపూర్ణాయుర్దాయం నూటఇరవై ఏండ్లని పెద్దలమాట. అంతకాలం జీవించేవాళ్లు అదృష్టవంతులే. నూరేళ్లు దాటకుండానే గతించేవారే ఎక్కువ. వయసులో ఏమి ఏ చేయాలో కాలం నిర్దిష్ట ప్రణాళికను సూచించింది. బాల్యంలో ఆటపాటలు, కౌమారంలో చదువుసంధ్యలు, యౌవనంలో వైవాహిక జీవనం, వార్ధక్యంలో ఆత్మశాంతి అనేవి సాధారణ విషయాలు. మనిషి ఏ ప్రాయంలో ఏది చేయాలో అది చేయకపోతే, కాలం విలువను జీవన మూల్యాన్ని కోల్పోయినట్లే. బాల్యంలో మనిషి ఆటపాటలతో ఎదిగితేనే క్రమాభివృద్ధి జరుగుతుంది. కౌమారదశలో బడికి వెళ్ళి చదువుకోకపోతే, జ్ఞానాన్ని కోల్పోయినట్లే. యౌవనంలో వైవాహిక జీవనాన్ని అనుభవించకపోతే, యౌవనం తిరిగి రాదు. వృద్ధాప్యంలో శాంతిమయ జీవనం లేకుంటే జీవితం భారంగా మారుతుంది.

కాలం పాదరసంలా జారిపోతుంది. పట్టుకుందామనుకుంటే దొరకదు. కాలం కర్పూరంలా హరించుకొనిపోతుంది. కనుమరుగైన తరవాత చింతించి లాభంలేదు. మనిషి తన కంటికి ఎదురుగా ఉన్న వర్తమాన కాలం విలువను గుర్తించాలి. మంచి పనులతో ముందుకు సాగాలి. ప్రతి క్షణాన్ని అమూల్య ధనంగా చూడాలి. వ్యంగా కాలాన్ని గడిపితే సంపదలు చేజారిపోక తప్పదు. దేవతలు సైతం కాలాన్ని అమూల్యంగా భావిస్తారు. కాలం కలిసిరానప్పుడు మౌనం వహిస్తారు. శుభసమయం కోసం వేచిచూస్తారు. తగిన సమయంలోనే అనుగ్రహిస్తారు.

కృషిచేసేవారికి కాలం ఎంతో విలువైంది. సోమరులకు కాలం విలువ లేనిదిగా కనబడుతుంది. మంచి పనులు చేసేవారికి ఇరవై నాలుగు గంటలూ అవసరమే. సూయ, చంద్రోదయాలు సక్రమంగా, సకాలంలో జరుగుతున్నందువల్లనే భూమిపై ఆరు రుతువులు క్రమం తప్పకుండా వస్తూ పోతున్నాయి. ఎండలు, వానలు, చలులు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో సమతౌల్యం జారిపోకుండా నిలుస్తోంది. ప్రపంచం సురక్షితంగా ముందుకు సాగుతోంది. కరుణించిన కాలం మనిషి మనుగడ చక్కగా ఉంటుంది. కనుక కాలం కాలం విలువను తెలుసుకొని మనిషి ప్రవర్తించాలి!
ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం?

మనిషి జీవించి ఉన్నంతవరకు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు మంచో, చెడో... ఏదో ఒకటి! మనిషి నిత్య చైతన్యశీలి. తన ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆలోచిస్తున్నప్పుడు అంతర్విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ ఆలోచన తనకు గాని, ఇతరులకు గాని మేలు చేస్తుందా, కీడు చేస్తుందా వివేకంతో ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి.

పెద్దలు ‘మంచిని చూడు, మంచిని విను, మంచి మాట్లాడు’ అని చెప్పారు. ‘నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పేదే నువ్వు వినాలి’ అన్న ధోరణి మనిషి అహంకారానికి, పతనానికి హేతువవుతుంది. సమాజంలో దురాలోచనతో, స్వార్థంతో, గర్వంతో, అజ్ఞానంతో, అవిద్యతో, అవినీతితో, అకృత్యాలతో ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడని వాళ్లను చూస్తున్నాం. అత్యాచారాలు, హత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిళ్లు... ఇలా ఎన్నో అవాంఛనీయ దుర్ఘటనలు చూస్తున్నాం. కారణాలనేకం... సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడమనేది తరవాతి సంగతి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎదుటివారి మాట వినాలి. అందులోని మంచీ-చెడూ సమీక్షించుకొని మంచి గ్రహించాలి. విజ్ఞులు, వేదమూర్తులు, ప్రవచనకారుల మాటలు వినడం నేర్చుకోవాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ప్రతిభ నిక్షిప్తమై ఉంటుంది. అది గ్రహించి, స్వీకరించే అలవాటు చేసుకోవాలి. సద్గ్రంథ పఠనం చేయాలి. సుభాషితాలను అవగాహన చేసుకోవాలి. అనుభవజ్ఞుల ప్రస్థానాన్ని అనుసరించాలి.

పుణ్యధాముడు పరమభక్తుడు. రోజూ సమీపంలోని గుడికి వెళ్ళి పురాణం వింటూ వచ్చేవాడు. భగవ న్నామస్మరణం చేస్తూ పేదలకు తన శక్తి మేరకు దానాలు చేసేవాడు. అతడి ఇంటికో రోజున ‘జ్ఞానసింధు’ అనే యాత్రికుడు అతిథిగా వచ్చాడు. పుణ్యధాముడు అతడికి సకల మర్యాదలూ చేసి భోజనం వడ్డించ బోయాడు. అతిథి ‘గంగానది ఇక్కడికి ఎంత దూరంలో ఉంది, స్నానంచేసి రావాలి’ అని అడిగాడు. ‘సమీపంలోనే ఉంది, కాని నేనెప్పుడూ వెళ్లలేదు’ అన్నాడు పుణ్యధాముడు. జ్ఞానసింధు కోపంతో ‘గంగలో స్నానం చేయని నీ ఇంట భోంచెయ్యను’ అంటూ స్నానానికి బయలుదేరాడు. ‘స్వామీ! నేను వికలాంగుణ్ని. పురాణ పఠనం జరిగిన చోటే సకల పుణ్యతీర్థాలు నెలకొని ఉంటాయంటారు కద స్వామీ! అందుకే నేను గుడికి వెళ్ళి రోజూ పురాణ శ్రవణం చేసి వస్తుంటాను!’ అన్నాడు పుణ్యధాముడు. జ్ఞానసింధు గంగా తీరానికి వెళ్ళి అడుగు వేసేసరికి నది వెనక్కి వెళ్ళింది. అడుగులు వేసినకొద్దీ గంగనీరు వెనక్కిపోతోంది. జ్ఞానసింధు విస్తుపోయాడు. గంగ నిజరూపంలో ప్రత్యక్షమై ‘విష్ణుకథాశ్రవణం చేస్తున్న పుణ్యధాముణ్ని అవమానించిన నీకు నేను అందను. వెంటనే వెళ్ళి క్షమాపణలు కోరు...’ అని అదృశ్యమైంది. జ్ఞానసింధు వెనక్కి తిరిగి వచ్చి పుణ్యధాముణ్ని క్షమాపణ కోరి భోంచేశాడు.
ఆలోచన, మాట, రాత, చేత, నడతలో పొరపాటు రాకుండా ఎప్పటికప్పుడు మనో విశ్లేషణ చేసుకోగలిగేవాడే మహామనీషి.
ఆరోగ్య జీవనం

ప్రతి మనిషి ఆరోగ్యం కోరుకుంటాడు. ఇలాంటి ఇచ్ఛ ఉండేది ఒక్క వ్యక్తికి ' మాత్రమే, అది కేవలం వ్యక్తిగతమేనా? కాదు. కార్యాలయాల్లోనూ ఆరోగ్యవంతుల్నే ఉద్యోగులుగా నియమించుకుంటారు. న్యాయస్థానాల్లో తీర్పులు వెలువరించేముందూ వాది ప్రతివాదుల (శారీరక, మానసిక ఆరోగ్యస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటారు. చట్ట సభల్లోకి అడుగు పెట్టే సభ్యుల్నీ అన్ని విధాలా యోగ్యులైన (ఆరోగ్యకరమైన ఆలోచనా దృక్పథమున్న) వారినే ఎన్నుకోజూస్తారు. దేశ భద్రతా దళాల సేనల్ని ఎంపిక చేసేటప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షిస్తారు. బావుల్లోంచి నల్లసిరులు తవ్వి తీసే సింగరేణి కార్మికుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

లోక కల్యాణార్ధమై ఏ పని చెయ్యాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఒక్క ఆరోగ్యాన్ని మాత్రమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లేనని భావిస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే అనేకానేకం సమకూర్చుకోగల సమర్థుడు. అలాంటి దృఢమైనవారే పురోభివృద్ధిలో సాధికారికంగా భాగస్వామి అవుతారు. ఆరోగ్యకరమైన మనసులోంచే సృజనాత్మక ఊటలు

జలజలా ఊరతాయి. అవి నూతనావిష్కరణలకు పురుడుపోస్తాయి. పరిశుద్ధమైన మనసు 'దీపం వెలిగే గృహం' లాంటిది. అందులోకి అరిషడ్వర్గాల చోరులు చేరరు. బదులుగా దానిలో 'సచ్చిదానందుడు' కొలువుండజూస్తాడు. ఆరోగ్యం అనేది కేవలం దేహానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది- ఏ రోగమూ లేని శరీరంతోపాటు దుఃఖానికి కించిత్తు చోటులేని మానసికం. ఆనందం, సచ్ఛీలత, పరిశుభ్రతల సమ్మిశ్రమం, నైతిక విలువలతో కూడిన జీవన గమనం.

తీసుకునేటప్పుడు కన్నా ఇచ్చేటప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందువల్లే ఎల్లప్పుడూ ఇచ్చే పంచభూతాత్మక ప్రకృతి తాజాగా ఉంటుంది. నిత్యనూతనం- ఆరోగ్యానికి పర్యాయపదం. ఆకాశమంత ఎత్తు పెరిగిన భారీవృక్షం భగభగమండే ఎండల్లో మాడుతుంది. పెను తుపానులో ఊగిపోతుంది. ప్రకృతి బాధించినా తట్టుకుని చెట్టు అలాగే నిటారుగా నిలబడే ఉంటుంది. కారణం- భూమ్మీద జీవరాశికి తనవంతు సేవలు మరికొంతకాలం అందించాలన్న బలమైన కాంక్షతో ఉండటం. ఆ కోరిక ప్రాకృతికమైంది. అదే పంచ భూతాల్లోంచి రూపుదిద్దుకొన్న మనిషికీ అలాంటి సంకల్పం ఉండాలి. అది ఆరోగ్యకరం.

'మనిషి చేసే సానుకూల ఆలోచనల ఫలితమే వారి ఆరోగ్యం... ప్రతికూల ఆలోచనలే వారి అనారోగ్యం' అని ఆధునిక వైద్యశాస్త్ర విభాగాలూ చెబుతున్నాయి. దుర్గుణాలతో కూడిన మనిషితో ఎవ్వరూ సాన్నిహిత్యం పెంచుకోరు. అంతదాకా ఎందుకు అనారోగ్యానికి గురైన లేదా దుఃఖం బారినపడ్డ మనిషినీ ఓదార్చేందుకు తనవాళ్లు సైతం చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతారే తప్ప అక్కడే ఉండిపోరు. కానీ- సత్యం, జ్ఞానం, ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, ఆప్యాయత, సానుభూతి, దానగుణం.... అనే అప్లైశ్వర్యాలతో తులతూగే మహనీయుల వద్దకు ఎంతోమంది శిష్యులుగా చేరి జీవితకాలం పాటు అక్కడే ఉండిపోతారు. "
ఆగమాల ఆంతర్యం

ఆగమం అనే పదానికి వేదం, శాస్త్రం అనే అర్థాలున్నాయి. దేవతా మూర్తుల ఆరాధనకు సంబంధించిన విధి విధానాలను వేదాలలో చెప్పిన విషయాల సంగ్రహాన్ని సైతం అగమం అంటారు. ఆగమాలు వైదికం, తాంత్రికం అని రెండు రకాలు. భగవంతుడిని ఎలా ఆర్చించాలి. ఎలా ప్రతిష్ఠించాలనే విషయాలను ఆగమాలు తెలుపుతాయి. రోజువారీ నిత్య కర్మలు, ఏదో ఒక ఉద్దేశంతో చేసే నైమిత్తిక కర్మలు, కోరికలు నెరవేరాలని చేసే కామ్య కర్మలు తదితరాల నిర్వహణకు వివరణ ఇస్తాయి. ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఎలాంటి విషయాలు అధ్యయనం చేయాలి. కర్మలు, ఉత్సవాలు నిర్వహించే యజమాని ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలనే విషయాలను తెలియజేస్తాయి. ఈ ఆగమాలు శైవాగమం, పాంచరాత్రాగమం, వైఖానసాగమం, స్మార్తాగమం. వీటిలో మళ్ళీ శాఖలు, ఉప శాఖలు ఉన్నాయి.

శైవ మతం ఇరవై ఎనిమిది ఆగమాలు, రెండు వందలకు పైగా ఉప ఆగమాలను భక్తులకు నిర్దేశించింది. కానీ దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో పూజాదికాలకు ఆరాధనా పద్ధతులకు కామిక ఆగమం, కారణ ఆగమాలనే శైవులు అనుసరిస్తారు.

పాంచరాత్రం, వైఖానస ఆగమాల ప్రకారం వైష్ణవ దేవాలయాల్లో పూజలు నిర్వర్తిస్తారు. అంటారు. కుమారస్వామికి శక్తి అనే నామాంతరం భాగాలుగా విభజించారు. ఈ నాలుగు పాదాల్లో సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరచారు. విధులను విశదీకరించారు. మూడోదైన యోగ సర్వజ్ఞతతో సర్వ శక్తిమంతుడిగా పరమాణువు

విష్ణువు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే అయిదుగురికి అయిదు రోజుల్లో ఉపదేశించినవి కాబట్టి దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. విఖనస రుషి నుంచి వచ్చింది కాబట్టి వైఖానసం అంటారు. ఈ మార్గానుయాయులు విష్ణువును ముఖ్య దైవంగా కొలుస్తారు. అయినప్పటికీ కొన్ని అలవాట్లు. ఆచారాలు బహుదేవతా ఆరాధనను సూచిస్తాయి.

వేదాలను, శాస్త్రాలను(స్మృతులను) అనుసరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే వారిని స్మార్తులు అంటారు. వీరు ఆదిశంకరాచార్యుల వారి అద్వైత వేదాంత తత్వాన్ని అనుసరిస్తారు. వేదం శాస్త్రాలలో చెప్పిన వాటిని స్మార్తాగమాలు ఉంది. కుమారస్వామిని పూజించేవారిని శాక్తేయులు అంటారు. వారు అనుసరించే

విధానాలను శాక్తేయం అంటారు. విఘ్నేశ్వరుడి పూజకు సంబంధించిన ఆగమం వినాయక పురాణం. ఇది విఘ్ననాయకుడి పూజాది కాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ ఆగమాలు తంత్రశాస్త్రాలతో పాటు మరెన్నో పురాణాలు, దేవతా మూర్తులను పూజించే పద్ధతులను విపులంగా సూత్రీకరించాయి. మన పూర్వీకులు ప్రతి ఆగమాన్ని నాలుగు

ఆగమాలు నిర్దేశించిన పూజలు, ఆరాధనలను స్పష్టం చేశాయి. చర్యా పాదంలో నిత్యం పూకు కావలసిన భౌతిక సామగ్రికి రెండోదైన క్రియా పాదంలో ఆచరించవలసిన భగవదారాధన ప్రక్రియను, యజ్ఞ యాగాది ఆచరణ

పాదంలో మనో నియంత్రణకు సంబంధించిన సూత్రాలను నిర్వచించారు. ఆగమాల్లో చివరి పాదం పూర్తిగా ఆధ్యాత్మిక పార్శ్వాన్ని స్పృశించింది. మోక్ష సాధనకు ఉపకరించే సూచనలను చేసింది...

భగవంతుడు ఒక్కడే అని, అతడే పరబ్రహ్మ... పరమాత్మ, పరమ పురుషుడని ఆగమాలన్నీ ఏకగ్రీవంగా బోధించాయి. అతడు సర్వాత్మకుడై,
సర్వజ్ఞతతో సర్వ శక్తిమంతుడిగా పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు వ్యాపించాడని వర్ణించాయి.
మార్పు

సృష్టిలో ప్రతీదీ కాలానుగుణంగా మార్పు చెందుతుంది. మార్పు అనివార్యం. మార్పు చైతన్య సూచిక. మార్పనేది కంటికి కనిపించనూ వచ్చు, కనిపించకపోనూ వచ్చు. చూడలేకపోయినంత మాత్రాన మార్పు చెందలేదని కాదు. నిత్యం ఒక వ్యక్తిని చూడటం కన్నా, కొంతకాలం తరవాత చూస్తే ఆ వ్యక్తిలోని మార్పు స్పష్టమవుతుంది. మొక్క చెట్టుగా ఎదగడం తెలుస్తుంది.

చీకటి వెలుగులు, మానవ, పశుపక్ష్యాదుల జీవితం, రుతువులు ఒక స్థితి నుంచి మరో స్థితికి చేరడానికి క్షణక్షణం మార్పు సంభవిస్తూనే ఉంటుంది. ఆ మార్పులోని దశలు కొంతవరకు అవగాహనకు వస్తాయి. వాటికీ ఆయా దశ సూచక పేర్లు పెట్టుకుంటాం. పరిపూర్ణ స్థితికి చేరాక ఆ ఆవృతం పూర్తవుతుంది. దానికో పేరు స్థిరపడుతుంది.

ప్రకృతి పరంగా మార్పులు సహజసిద్ధంగా జరుగుతాయి. అవి మార్చలేనివి. సృష్టిలో కోరుకున్నట్టుగా మార్పు చెందే అవకాశం ఒక్క మనిషికే ఉంది. మానసికంగా, శారీరకంగా ఎలా కావాలంటే అలా మారవచ్చు. అది మానవ జన్మ అదృష్టం, వరం. కంటికి అగుపించని మనసును కనిపెట్టి, అర్థం చేసుకుని, అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని అనుకోవడంతోటే మనిషి జన్మ ఉత్తమత్వం పొందుతుంది. శరీరం మీద దృష్టి నిలిపి అందచందాలను మెరుగుపరచుకునే వారికన్నా,  మనసును తీర్చిదిద్దుకుని సేవాభావ   దృక్పథంతో మెలగేవారు మాననీయులు.

అందం ఎప్పటికీ ఒక్కలా ఉండేది కాదు. అది వయసుతోపాటు రకరకాల మార్పులకు లోనవుతుంది, రుతువుల ప్రభావానికి గురవుతుంది. మనసు అలాకాదు. అది కనిపించదు కాబట్టి మనం ఎలా మలచుకుంటే అలా స్థిరమవుతుంది. వృద్ధాప్యంలో కుర్రతనం ఉరకలెత్తడానికి, యౌవనకాలంలో లక్ష్యం లేక చతికిలబడటానికి మనసుకు మనిషి ఇచ్చే తర్ఫీదే కారణం. మనసు మనిషికి వన్నె తెస్తుంది. హరిశ్చంద్రుడు మనసుకు సత్యం మప్పాడు. రాముడు సకల గుణాలతో మనసును మేళవించాడు. ఒకరు సత్యహరిశ్చంద్రుడైతే, మరొకరు సకల సుగుణాభి రాముడిగా ఆదర్శప్రాయులయ్యారు.

సాధారణంగా మనిషి ప్రవర్తనతో అతడి మనసును అంచనా వేస్తారు. తెల్లనివన్నీ పాలు కాదు. నల్లనివన్నీ నీళ్లనీ అనుకోకూడదు. మెరిసేదంతా బంగారం కానేకాదు. నటన- సృష్టిలో మనిషికి మాత్రమే అబ్బిన కళ. మంచితనం, మానవత్వ భావాలతో క్రమంగా మనసును మార్చుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకోవలసిన మనిషి, అవసరాలకు అనుగుణంగా నటిస్తుంటాడు. చెడ్డతనాన్ని దాచిపెట్టి మంచితనాన్ని ప్రదర్శిస్తాడు. ప్రపంచానికి అది సహజమా, నటనా అన్న తేడా తెలియనంతగా ప్రవర్తిస్తాడు.

నీతి, న్యాయం, నిజం, నిజాయతీలను నిర్వచించిన మనిషి అవినీతి, అన్యాయం, అబద్ధం, మోసం, దగా, కుట్రలకు కేంద్రం అవుతున్నాడు. పాలలో నీళ్లను కలుపుకొంటూ పోతే చివరికి క్షీరం అస్తిత్వం కోల్పోయి నీరవుతుంది. ధర్మం నాలుగు పాదాలపై నిలబడినప్పుడే సమాజం పచ్చగా పది కాలాలు పరిఢవిల్లుతుంది. రాబోయే తరాలకు నిష్కల్మషమైన, నిష్కపటమైన ఆహ్వానం పలుకుతుంది. మనిషి జన్మకు శాశ్వతత్వాన్నిచ్చే ధర్మాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం కాసుకు లొంగి అధర్మం బాట పట్టడం, అది కలి ప్రభావం అని సమర్థించుకోవడం ఆత్మవంచన. మనసును ఏమార్చుకుంటూ కాకుండా ఉత్తమంగా మార్చుకుంటూ ఇలలో దైవత్వాన్ని సాధించడమే మానవజన్మకు పరిపూర్ణత. లేదంటే జీవితమే వ్యర్థం!
మంచివాళ్ళకి కష్టాలు ఎందుకు?

బాయిజాబాయి సాయికి భోజనం వడ్డిస్తూ- ‘సాయీ! ధర్మంగా జీవించేవారికే ఎక్కువ కష్టాలుంటున్నాయి.. ఎందుకలా?’ అంది. సాయి నవ్వి ‘ఈ ప్రశ్న చాలామంది, అడిగారు. ఇదేం జటిలమైంది కాదు. మనలో సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో గుణం పాలు అధికంగా ఉంటుంది. ధర్మం, న్యాయం, సత్యం- అనే విషయాలను సత్వగుణులు ఒకలా, రజోగుణులు ఇంకోలా, తమోగుణులు మరింత భిన్నంగా అర్థం చేసుకుంటారు. అసలు నిజం ఒకటే అయినా మూడు రకాలుగా చూస్తున్నారు. అందుకే ఇన్నిన్ని భేదాలూ, విభేదాలూనూ. ఈ సత్యాన్ని అర్థంచేసుకుంటే ఘర్షణలతో పనే ఉండదు. సామరస్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం మంచిగా ఉన్నంతలో సరిపోదు. గతంలో ఎవరికైనా హాని చేసి ఉంటే.. ఆ చెడు కర్మల ఫలం ఇప్పుడు వెంటాడుతుంది. ఆ బాధను అంటే కష్టాల తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే మన వల్ల ఇక్కట్లపాలైన వారిని క్షమించమంటూ అభ్యర్థించాలి. ఒకవేళ వాళ్లు లేకుంటే.. వారి కుటుంబసభ్యులను వెతుక్కుంటూ వెళ్లి చేతనైన సహాయం చేయాలి’ అంటూ వివరించాడు బాబా.
నృసింహశరణ్యం

శ్రీశంకరభగవత్పాదులు జగద్గురువులు. ఆయన స్థాపించిన సిద్ధాంతం అద్వైతం. అద్వైతం అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పడం. పైకి చూస్తే భేదం ఉన్నట్లు కనబడుతున్నా- లోతుగా చూస్తే ఏ భేదమూ లేదని, జీవుడు కూడా దేవుడిలోని వాడేనన్న నమ్మకం కలుగుతుంది. ఉదాహరణకు చేతిలో మట్టి ముద్దను తీసుకొని, దాన్ని ఒక కుండలా రూపొందించవచ్చు. కుండగా కనిపిస్తున్న మట్టి, నేలలో ఉన్న మట్టి ఒక్కటే. కుండ పగిలిపోతే మట్టిలోనే కదా కలిసిపోయేది? ఎన్నటికైనా మట్టి ఒక్కటే శాశ్వతం, కుండ ఆశాశ్వతం అని తెలుసుకోవడమే అద్వైతం.

ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆసేతుహిమాచలం పర్యటించి, ప్రబోధించిన శంకరులు శివకేశవభేదం లేకుండా దేవతలందరిపైనా అమూల్య స్తోత్రాలను రచించారు. అజ్ఞానాన్ని దూరం చేయాలని ప్రార్థించారు. అందరినీ కష్టకాలంలో ఆదుకొమ్మని వినుతించారు. అందుకే ఆయన జగద్గురువులయ్యారు. శంకరభగవత్పాదులు రచించిన అమూల్య స్తోత్రరత్నం లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రం. ఇందులో జగద్గురువులు మానవాళిపై అపారమైన సహానుభూతితో నృసింహస్వామిని అనేక విధాలుగా కొనియాడారు. చేయూతనిమ్మని వేడుకున్నారు. అందుకే దానికి

'కరావలంబ' (చేయూతను ప్రసాదించే) స్తోత్రం అనే పేరు వచ్చింది.

ఓ దేవదేవా! నీవు యోగీశ్వరుడివి. శాశ్వతుడివి. సంసారసాగరంలో నిలిచిన నౌక వంటివాడివి. స్వామీ! నాకు చేయూతనిచ్చి కాపాడు! ఈ సంసారం భయంకరమైన దట్టమైన అడవి వంటిది. ఇందులో కోరికలు అనే సింహాలు సంచరిస్తాయి. కోరలు సాచిన ఆశలు క్రూరమృగాల్లా వెంటాడతాయి. ఈ అడవిలో ఎంతదూరం సంచరించినా భయంపోదు... స్వామీ! ఈ అడవిలో నీ చేయూతనిచ్చి నన్ను కాపాడు. ఎంత ఈ సంసారం ఒక అగాధమైన బావిలాంటిది. ఇది

లోతుగా ఉందో తెలియదు. లోతులోకి దిగితే కష్టాలు పాములై కాటువేస్తాయి... ఈ ఘోర కూపంలో నీ చేయూతనిచ్చి నన్ను కాపాడు! ఈ సంసారం సాగరంలాంటిది. ఈ సముద్రంలో భయంకరమైన మొసళ్లున్నాయి. తిమింగిలాలున్నాయి. అంతులేని ఈ సాగరంలో ఈదలేకపోతున్నాను. స్వామీ! నీ చల్లని చేయిని అందించి రక్షించు! ఈ సంసారం విషవృక్షం లాంటిది. ఎంతో ఎత్తుకు ఎగబాకిన ఈ చెట్టు పైనుంచి కిందికి దిగలేకపోతున్నాను. స్వామీ! నీ చేయూతనిచ్చి నన్ను రక్షించు! ఈ సంసారం ఒక మహా విషసర్పం లాంటిది. దాని విషం భయంకరంగా ఉంది. నన్ను కాటువేయడానికి విషసర్పం కోరలుసాచి బుసలు కొడుతోంది. కనుక శేషశయనా! నీ చేయూతను అందించి నన్ను కాపాడు! ఈ సంసారం ఒక దావాగ్ని వంటిది. అడవి అంతా తీవ్రమైన మంటలతో తగలబడిపోతుంటే ఎటూ దారి మంటలలో చిక్కుబడి ఉన్నాను. దేవదేవా! నీ చేయూతనందించి కాపాడు! ఈ సంసారం ఒక వలలాంటిది. కష్టాల వలలో పడి చేపలా కానరాక

కొట్టుకుంటున్నాను. స్వామీ! నీ చేయూతనందించి నన్ను రక్షించు!

ఈ సంసారం మదపుటేనుగు వంటిది. అది నన్ను తొండంతో పట్టుకొని, నేలకేసి కొట్టి చంపివేయాలని చూస్తోంది. స్వామీ! నీ చేయూతనందించి ఉద్ధరించు! అజ్ఞానం నన్ను గుడ్డివాడిగా చేస్తోంది. ఇంద్రియాలు దొంగల్లా నన్ను నిత్యం దోచుకుంటున్నాయి. వ్యామోహం అనే అగాధంలో పడిపోతున్నాను. స్వామీ! | నీ చేయూతనందించు! నీవే నాకు శరణు! మధుసూదనా!

కేశవా! జనార్ధనా! వాసుదేవా! లక్ష్మీనృసింహా! నన్ను రక్షించు! ఈ స్తోత్రాన్ని పఠిస్తే సమస్త భయాలూ దూరమవుతాయంటారు. లక్ష్మీనృసింహుడి కారుణ్యం అమృతంలా వర్షిస్తుందని చెబుతారు.
జీవితమంటే ఇవ్వడమే!

నువ్వు ఇవ్వదగినదేదో ఇవ్వు... అది వెయ్యింతలై నీకు తిరిగి దక్కుతుంది. కాని, నీ దృష్టి దాని మీదే ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద సూక్తి. మానవజన్మ ఇచ్చేందుకే కలిగింది. ఎంతసేపూ నాకు ఏమిటని అనుకోవడం స్వార్థం. నీకేం కావాలి అని అడగడం పరమార్థం. ఇలా అడగడంలో ఏమైనా ఇవ్వడంలో మనిషి పొందే సంతృప్తి, ఆనందం అనుభవైకవేద్యం, 'నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు. ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం' అంటారు. మదర్ థెరెసా ఇతరులనుంచి సహాయం పొందడంలో కన్నా వాళ్లకు చేతనైనంత సాయం అందించడంలో కలిగే సంతోషమే గొప్పది.


సముద్రం ఇచ్చిన నీరు గ్రహించి సూర్యుడు ఆవిరి

చేస్తున్నాడు. ఫలితంగా ఏర్పడిన మేఘాలు వర్షిస్తున్నాయి. ఆ నీరు గ్రహించిన నేల- మనిషికి చెట్టు. ఫలాలు, కలప ఇస్తోంది. వీటిలో దేనికి స్వార్ధం ఉంది? ప్రకృతి నుంచి పంచభూతాలనుంచి మనం నేర్చుకో వలసింది ఇదే!

ఎంత నిరుపమానమైన త్యాగం చేసి రుషులు, మునులు, పండితులు, బుధులు, నేతలు సమాజ కల్యాణానికి
తమను తాము సమర్పించుకున్నారు. జగతి ప్రగతి కోసం అంకిత మైపోయారు! మనకు మెతుకు ఇవ్వడానికి రైతు శ్రమిస్తున్నాడు. మనకు బతుకునివ్వడానికి తన ప్రాణాన్ని పణం పెడుతున్నాడు. ఇలా ఎందరెందరో జీవితం అంటే ఇవ్వ డమన్న మాటలకు సాక్షీభూతులై కనపడుతున్నారు. ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు కాని, కష్టకాలంలో మనతో పాటు విలపించిన మనిషిని మాత్రం మరిచిపోకూడదు. ఆదే మానవత్వం. ప్రతి మనిషికీ మరణం ఉంటుంది. కాని, మానవత్వానికి ఉండదు. కర్ణుడు, శిబి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు జీవితానికున్న పరమార్ధాన్ని అర్ధం చేసుకుని ఆచరించిన వారు. 'నాది అనుకున్నదేదీ నాది కాదు' అన్న సత్యం గ్రహించినవారు. త్యాగశీలికి కులం, మతం, వర్గం, ప్రాంతం, సమయం, సందర్భం... ఇవేవీ అడ్డుకావు. మనిషి, పక్షి, పశువు ఇలాంటి తారతమ్యాలను అతడు చూడడు. లోగిలిలోని కుక్క మనం పెట్టేముద్ద తిని, నమ్మకంగా అక్కడే ఉంటుంది. యజమాని వెంటనంటే ఉంటుంది. ఆమాత్రం విశ్వాసం మానవుడిలో ఉంటే చాలు, మానవత్వం వికసిస్తుంది. పొందిన ఉపకారానికి ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేయడమే మనిషి గౌరవాన్ని కీర్తిని
మంచిమాట, సలహా ఇతరులకు చెప్పడానికి మనిషి ఆసక్తి చూపాలి. మేలుచేయడానికి, త్యాగం చేయడానికి తపించాలి. సాటి మనిషిని, నిస్సహాయుణ్ని ఆదుకునేందుకు ఆవేదన చెందాలి. ఎవరైనా చెయ్యి చాపితే, సగం మరణించినవాడని, అలా చెయ్యి చాపినప్పుడు 'లేదు' అనేవాడు ముందే మరణించిన వాడితో సమానమనీ అంటాడు కబీర్ కుటుంబంలోనే పరస్పర త్యాగశీలత అలవడితే, అది సమాజంలో విస్తరించి ప్రపంచమంతా..పరివ్యాప్తమవుతుంది.
సమయపాలన

అనంతమైన కాలవాహినిలో ఒక నిర్దిష్ట భాగాన్నే 'సమయం' అంటారు. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు- ఏదైనా కావచ్చు. మనిషి ప్రతి చర్యను సమయం శాసిస్తుంది. ఏ సమయంలో ఏమి చెయ్యాలో ముందే నిర్దేశితమై ఉంటుంది. మనిషి క్రియలన్నీ ప్రకృతికి అనుసంధానమై ఉన్నంతకాలం సర్వత్రా సత్ఫలితాలే లభిస్తాయి. ప్రకృతికి వ్యతిరేకంగా ఏది చేసినా విరుద్ధ ఫలితాలే ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తానే బలిష్ఠమైన, కాలస్వరూపుడినంటాడు. యమధర్మరాజును కాలుడనీ పిలుస్తారు. మృత్యు దేవతా కాల స్వరూపమే. అది

మనిషి జయించగలడా? ఎక్కువ మంది వినోద విలాసాలు సుఖభోగాలతోనే గడపాలనుకుంటారు. లేదా నీతి నియమాలను గాలికి వదలి అక్రమ సంపాదనతో అపర కుబేరులుగా జీవించాలనుకుంటారు. అంతే తప్ప 'పరోపకార మిదమ్ శరీరమ్' అనే ఆచరించాలని పొరపాటునైనా అనుకోరు.

శరీరంతో సుదీర్ఘకాలం జీవిస్తూ, స్వార్థానికి పెద్దపీట వేసేకన్నా, ఆదిశంకరుల్లా అల్పాయుష్షుతో జీవించినా జీవన సాఫల్యాన్ని సాధించి కీర్తి శరీరంతో చిరంజీవిగా ఉండిపోవచ్చు.

ఈ లోకంలో కి అనునిత్యం లక్షలమంది వస్తూ, మరికొన్ని లక్షలమంది నిష్క్రమిస్తున్నారు. కానీ, కాల చరిత్రలో వీరిలో బహుకొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఆ కొద్ది మందే తమ జీవితాలను సార్థకం చేసుకోగలిగినట్లు మనం గ్రహించాలి. అర్థవంతంగా జీవించడమే సార్థకత.

అర్ధవంతమైన జీవితమంటే కోట్లాది రూపాయల ధనం కన్నా విలువైన ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ప్రతి మనిషీ తనకొక వ్యాపకం పెట్టుకుంటాడు.. అది వృత్తి, లలితకళలు, సాహిత్యం వంటిది ఏదైనా కావచ్చు. ఉద్యోగమూ కావచ్చు. అందులో అంకితభావం ఉంటేనే సత్ఫలితాలు, పదోన్నతులు, ప్రశంసలు, పురస్కారాలు, ప్రజ్ఞకు గుర్తింపు లభిస్తాయి. అసలు ప్రజ్ఞ లభించాలంటేనే గట్టి పట్టుదలతో తాను ఎంపిక చేసుకున్న రంగంలో కృషి చెయ్యాలి. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు తప్పక లభిస్తాయి. విద్యార్థులు చదువు విషయమూ అంతే. ఏ రంగాన్నికైనా ఇది వర్తిస్తుంది. భక్తి స్థాయిని బట్టే ఫలితాలు, దైవానుగ్రహం లభిస్తాయి.

చాలా మంది తమ కృషిని గురించి తామే ఘనంగా భావిస్తారు. కొందరు ఆర్భాటంగా సందర్భం లేకపోయినా ప్రచారాలు చేసుకుంటారు. దానివల్ల అపహాస్యం పాలబడే ప్రమాదం ఉంది. ఎవరి పరీక్షా పత్రానికి వారే మార్కులు వేసుకోనట్టే, ఎవరి కృషిని వారు నిర్ణయించుకోకూడదు.

ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 'దైవనామస్మరణ' అత్యుత్తమంగా మహర్షులు చెప్పారు. నామస్మరణ చేస్తూనే నిత్యకృత్యాలు తమ చక్కబెట్టుకోవచ్చు. సద్గురు గోవిందసింగ్ 'యుద్ధంలో ఉన్నా హృదయంలో పరమాత్మను నిలుపుకోవాలి' అన్న అమృతవాక్కులు అందరికీ శిరోధార్యం. ఎందుకంటే జీవితమే ఒక యుద్ధరంగం. ఇక్కడ సమయానికి మించిన ఆయుధాలు ఉండవు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే జీవన సాఫల్యం.
స్వార్థం దుఃఖహేతువు

మనుషులలో అత్యధికులు స్వార్ధపరులే. నేను-నాది అని నిత్యం తపిస్తూ సంపద కూడబెట్టడమే పరమార్ధమనుకుంటారు. భగవంతుడి సృష్టిని మొత్తం తామే అను భవించాలనుకుంటారు. ధర్మమా, అధర్మమా అని ఆలోచించకుండా సంపాదించే స్వార్థపరులు తమ సంపాదనకు సహకరించాలని సృష్టికర్తనే అర్ధిస్తారు. నాకిది, నీకిది అంటూ భగవంతుడికే తమ అక్రమార్జనలో వాటా ఇవ్వజూపుతారు. ఒక కోరిక తరువాత మరో కోరిక తీరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ అంతులేని కోరికలతో సతమతమవుతుంటారు.

స్వార్ధం మనిషి ఆలోచనా శక్తిని నశింపజేస్తుంది. మానవత్వాన్ని మంటగలుపు తుంది. స్వార్థపరత్వం మాత్సర్యాన్ని ప్రేరేపిస్తుంది. ఎదుటివారి పతనాన్ని కోరు కుంటుంది. స్వార్థపరుడు లోభిగా మారతాడు. లోభం మనసులో ఆశలు రేపుతుంది. దురాశ ధర్మవిరుద్ధమైన పనులను ప్రోత్సహిస్తుంది.

పాండవులకు అయిదు ఊళ్లయినా ఇవ్వజూపని దుర్యోధనుడి స్వార్థం కౌరవ వంశ నాశనానికి దారితీసింది. తన కుమారుడికే రాజ్యాభిషేకం చేయాలన్న కైకమ్మ స్వార్థపరత్వం దశరథుడి ప్రాణాలు తీసింది. తన స్వార్థం కోసం ఇతరులను బాధించాలనుకోవడం వినాశకరం.

శ్రీ రామానుజులవారు గురువుగారి నుంచి మంత్రోపదేశం పొందారు. మంత్రార్థాన్ని తన ఊరి వారందరికీ బోధించారు. గురువుగారు కోపగించారు. వాగ్దాన భంగం చేసి నందుకు తానొక్కడినే నరకానికి వెడతానని, ఎంతోమంది భక్తులు ముక్తిమార్గంలో పర మాత్ముడిని చేరుకోగలిగితే కలిగే ఆనందం నరకం కన్నా మిన్న అన్న శ్రీ రామానుజుల వారు పూజనీయులయ్యారు. నిస్వార్థ భావం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.

దానం సర్వశ్రేష్ఠమైనదని, న్యాయార్జిత విత్తాన్ని పాత్రుడికి దానం చేస్తే పరలోకంలో ఉన్నతమైన ఫలం లభిస్తుందని అరణ్యవాస సమయంలో వ్యాసమహర్షి ధర్మరాజుకు ఉపదేశించినట్లు మహాభారతం చెబుతోంది. పాండవుల మహాప్రస్థానంలో ఒక కుక్క వారిని అనుసరించింది. సోదరులు పడిపోగా, ధర్మరాజును కుక్క దారిలో ద్రౌపది, చివరి వరకూ అనుసరించింది. ఇంద్రుడు రథంపై వచ్చి సశరీరంగా ధర్మరాజును స్వర్గానికి తీసుకు వెళతానం టాడు. ధర్మరాజు తనను అప్పటిదాకా అనుసరించిన కుక్కకు కూడా స్వర్గప్రాప్తి కలి గించమంటాడు. అందుకు ఇంద్రుడు అంగీకరించకపోతే ధర్మరాజు తానూ స్వర్గానికి రాలేనంటాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత యుధిష్ఠిరుణ్ని కొనియాడుతూ- ఒక కుక్క కోసం ఇంద్రుడి రథాన్ని కూడా పరిత్యజించిన ధర్మరాజుకు సమానులెవరూ స్వర్గంలో లేరని అంటాడు. అలా ధర్మరాజు

పరమోత్కృష్టమైన దివ్యగతిని పొంది సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు. నిస్వార్థ సేవకు ప్రతీక ప్రకృతి. నిస్వార్థంగా సేవ చేయాలన్న సత్యాన్ని మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ఇతరుల ప్రయోజనాలు విస్మరించి అన్నీ తనకే కావాలన్న స్వార్థపరత్వం దుఃఖానికి హేతువవుతుంది. పరమేశ్వరుడైన తనను నిరంతరం అనంత భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించేవారి యోగక్షేమాలను తానే వహిస్తానని భగవానుడి గీతోపదేశం. భగవంతుడు మనిషికి సేవ చేసే శక్తిని, బుద్ధిని ప్రసాదించాడు. నిస్వార్థంగా సేవచేసే వారికి భగవంతుడి అండ లభిస్తుందనడంలో సందేహం లేదు.

మానవ జన్మ ఉత్తమమైనది. మానవుడు జ్ఞానవంతుడు. జ్ఞానానికి వివేకం తోడైతే మనిషి రాణిస్తాడు. మంచిచెడుల విచక్షణ తెలుసుకుని స్వార్థాన్ని కట్టడి చేయగలవాడే ఉత్తముడు. ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే మనుషుల మధ్య స్నేహ సంబంధాలు పరిఢవిల్లుతాయి. నిస్వార్థ సేవకులతో సమాజం శోభిస్తుంది.
💐💐శివాభిషేకంతో...విశిష్ట ఫలితాలు💐💐

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
ఎక్కడ ప్రశాంతత?

మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగా నే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుడ్డుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవదశ దాటే సమయంలో బాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే ముంచుకొస్తుంది. ఆ తరవాత దైహిక, మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్యా మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తరవాత మరొకటిగా కడలి కెరటాల్లా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూ ప్రపంచంలో లేడనేది పరమసత్యం. మనిషి చీకటిని చీల్చుకొని వెలుగుకోసం వెదికినట్లు అశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి. కష్టాలు నిప్పు కణికల్లాంటివి. చల్లదనాన్ని పొందడానికి వాటిలోంచే త్నించాలి. వేసవికాలంలో సూర్యుడి కారణంగా వేసవి ముగిసిన జల్లులు కురిసే వేసవికి చల్లని వస్తుంది. సూర్యుడే వర్షానికి వర్షాకాలం కారణమైన కారణభూతుడు. సూర్యుడి వేడిమితో సముద్రజలాలు వేడెక్కి ఆవిరి పైకి సి తరవాతే కదా ఆకాశంలో మేఘాలు కురుస్తాయి. ఉత్పన్నమై వర్షాలు కనుక సమస్యలోనే సమాధానం కూడా ఉంటుందనేది ప్రకృతి చెప్పే ఉపదేశం!

మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకొంటూ అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటికలలు కంటాడు. అందని ద్రాక్షపండ్ల కోసం అర్రులు చాస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ, గాలిమేడలు కడతాడు. వీటివల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మరచిపోతే మనిషికి అశాంతి గాక ప్రకృతి మనిషికి

అన్ని వనరులనూ పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోకూడదు. పంచభూతాలు మనిషి ప్రశాంత ఆధారాలు, వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్తకుండీలా మార్చివేస్తున్నాడు మనిషి చెట్లను విచక్షణారహితంగా నరికివేసిన పాపం, కాలుష్యపు ఉద్గారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి మరణశాసనమై ప్రపంచాన్ని పీడిస్తోంది. ధ్వనికాలుష్యం గుండెలను చిద్రం చేస్తుంటే మనిషి ఆరోగ్యం మంటగలిసిపోతోంది. లక్షల ఏళ్లనాటి హిమ ఖండాలు. కరిగిపోతూ, జలప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే పుడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిలోదకాలివ్వడం... మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను

బందిఖానాలోకి నెట్టేస్తున్నాడు. సమైక్యజీవనం, సమభావం కొరవడుతున్నాయి. అన్నింటినీ పోగొట్టుకొనే మనిషికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది? తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రసన్నతను, ప్రశాంతతను శోధించి, పట్టుకోవాలి.
కారణం ఏమిటి?

ఈ లోకంలో ఆకారణంగా ఏదీ జరగదు. అలాగే మన జీవితాల రూపకల్పనకు సైతం ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది. బాల్యమంతా దానికి సంబంధించిన ఏ ఆలోచనా లేకుండా సాగిపోతుంది. కొంత వయసు వచ్చేవరకు తన ఎదుగుదలకు, శరీరభాగాల కదలికకు సైతం ఏదో ఒక శక్తి మూలమై ఉందనే ఊహ కలగదు. ఆ దివ్యశక్తినే అందరూ తలో రకంగా భావిస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ కలిగే రకరకాల అనుభవాల సారంతో కొంత వివేకం కలిగి, మానవజన్మ ఏదో ఒక విద్యుక్తధర్మ నిర్వహణ నిమిత్తం ప్రాప్తించిందనే స్పృహ ఏర్పడుతుంది. అంతవరకు తన గురించి తనకే తెలియని పసివాడిలాగే, యాంత్రికంగా జీవితం సాగిపోతుంటుంది.

అద్భుతమైన యంత్రంలా, వాహనంలా, బహుళార్ధక సాధక పరికరంలా ఉపకరించే మానవ శరీరం- పరమాత్మ ప్రసాదితం. ఆ దివ్యానుగ్రహంతోనే హృదయనుండే శ్వాసక్రియలతో కూడిన జీవవైతన్యం సాగుతుంటుంది. జీవరాశులన్నీ పరమాత్మ ప్రమేయంతో తమతమ కర్మలు చేస్తుంటాయి. శరీరాల పరిమాణంలోను, పరిణామంలోను అంతరం ఉన్నా అన్నింటిలోనూ పరమాత్మ అంశ మాత్రం ఒకటే అన్నీ ఆయన బందువర్గంలోనివే అన్నింట్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పరిణామం చెందినవాడు మానవుడు. మానవజన్మ ఏ నిమిత్తం ఎంత సామర్థ్యంతో ప్రాప్తించిందో అనే ఎరుక కూడా సాధించగల సమర్థుడు. ఆ ఎరుకతో తన ధర్మాచరణే ధ్యేయంగా జీవితం సాగించే మానవుడికి పరమాత్మ అనుగ్రహమైన ఆధ్యాత్మిక శక్తి బలంగా రూపొందుతుంది. జీవన యానానికి ఉపకరించే శారీరక, మానసిక శక్తులకు మూలం ఆధ్యాత్మిక శక్తి. జీవితం సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం. మానసికం, శారీరకం అనే మూడు విధాలైన శక్తులు కూడా అవసరమే. మూడింటి సహకారంతోనే జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోవచ్చు. వాటిమధ్య సమన్వయం సాధించలేని జీవితం కేవలం యాంత్రికంగా సాగుతున్నట్లు ఉంటుంది. యాంత్రికమైన జీవితంలో ఏదీ కూడా స్వయంకృషితో సాధించిన ఆత్మ తృప్తి కలగదు. ఆనందంగా జీవిస్తున్న అనుభూతి కలగదు. యాంత్రికంగా సాగుతున్నట్లు కనిపించే జీవితానికి వెనక ఏదో ఒక నిమిత్త కారణం ఉంటుంది.

అంతర్యామి

విశ్వంలో భాగమైన ప్రతీ జీవికి ఏదో ఒక విశిష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. వేదవాక్కు. తన సృష్టిలో జీవులన్నీ వాటివాటి ప్రజ్ఞతో పరస్పరం సహకరించుకుంటూ ఆనందంగా ఉండాలని, లోకాస్సమస్తా సుఖినోభవంతు అని సృష్టికర్త ఆశించడం సహజం. ఆయన సంకల్ప మార్గంలో సాగడమే ఆధ్యాత్మిక పరమావధి. మన సంకల్పం పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా ఉన్నంత కాలం మనకు ఆయన దివ్యశక్తి తోడవుతుంది. ఆధ్యాత్మిక శక్తిప్రబాత ఎవరో తోడున్నారనే

విశ్వాసంతో ఏ పని చేపట్టినా విజయం పొందగల మనో ధైర్యం కలుగుతుంది. పరమాత్మ ప్రమేయం లేకుండా ఏ కార్యమూ జరగదు. తాము ఉన్నత స్థితికి చేరాలంటే కేవలం తమ ప్రజ్ఞ కాదు, పరమాత్మ్య దివ్యానుగ్రహం సైతం పొందాలని గ్రహించడమే వివేకం. అది సాధించడానికి తగిన కర్తవ్య నిర్వహణతో జీవించాలి. అప్పుడే మానవ జన్మ ప్రాప్తించిన నిమిత్త కారణానికి న్యాయం చేసినట్లు అవుతుంది.

ఏ సంకల్ప సాధనకై ఎంత కృషి చేయవచ్చు అనే వెసులుబాటు మన చేతిలోనూ కొంత ఉంటుంది. ఆ స్వేచ్ఛ అద్భుతమైన వరం లాంటిది. ఆ స్వేచ్ఛ వినియోగంలో వరప్రదాత సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అది విస్మరించకుండా చేసే కృషి వల్ల లభించిన వరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ దివ్యానుగ్రహ సాధన ఫలితంగా పొందే ఆనందం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. మానవజన్మ సార్ధకం అవుతుంది.
స్వధర్మం

యుద్ధ విముఖుడైన అర్జును డికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ చేస్తూ... స్వధర్మం గురించి వివ రించాడు. క్షత్రియుడైన అర్జునుడు యుద్ధానికి వెనుకాడకూడదని, ఎందుకంటే అది అతని స్వధర్మమ మనీ స్పష్టం చేశాడు. భగవద్గీతను ప్రారంభిస్తూ “అది' శాశ్వతమైనది, అవ్యక్తమైనది, అంతటా వ్యాపించి ఉన్నది" అని చెప్పాడు. 'అది' అనే మాటను 'ఆత్మ' అని చెప్పుకొంటే... అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. తరువాత ఆయన స్వధర్మం గురించి తెలిపాడు. అంతరాత్మ గురించిన జ్ఞానాన్ని పొందడానికి చేసే ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ మన ప్రస్తుత స్థితి, రెండోది స్వధర్మాన్ని గురించి తెలుసుకోవడం, అంతిమంగా... అంతరాత్మను చేరుకోవడం. వాస్తవంలో, 'మన ప్రస్తుత స్థితి' అనేది మన స్వధర్మం, అనుభవాలు, విజ్ఞానం, జ్ఞాపకాలు, చంచలమైన మనస్సు ద్వారా పోగు చేసుకొనే ఊహాగానాల సమ్మేళనం. మానసికమైన ఈ భారాలన్నిటి నుంచీ మనల్ని మనం విముక్తి చేసుకున్నప్పుడు... స్వధర్మం మెల్లగా వ్యక్తం కావడం ప్రారంభిస్తుంది. 'క్షత్రియ' అనే మాట 'క్షత్', 'త్రయతే' అనే పదాల సమ్మేళనం. 'క్షత్' అంటే హాని, 'త్రయతే' అంటే రక్షణ ఇవ్వడం. హాని నుంచి రక్షణ ఇచ్చేవారు క్షత్రియులు. మాతృమూర్తి దీనికి చక్కటి ఉదాహరణ. తల్లి తన బిడ్డలకు గర్భంలో రక్షణ కల్పిస్తుంది. వారు పుట్టాక... తమ కాళ్ళ మీద తాము నిలడేవరకూ కాపాడుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనకు ఎదురయ్యే మొదటి క్షత్రియ ఆమె. బిడ్డల సంరక్షణలో ఆమెకు శిక్షణ లేకపోవచ్చు, అనుభవం లేక పోవచ్చు. కానీ అది ఆమెకు సహజంగానే వచ్చేస్తుంది. స్వధర్మం అనే లక్షణానికి ఇది సంగ్రహమైన అవలోకనం. ఒకసారి ఒక గులాబీ... గంభీరమైన తామర పువ్వు చేతిలో దెబ్బతింది. అప్పుడు తనుకూడా తామర పువ్వు కావాలనే కోరిక దానిలో మొదలైంది. కానీ ఒక గులాబీ... కమలంగా మారే అవకాశం లేదు. తన సామర్థ్యం కన్నా భిన్నంగా ఉండాలని గులాబీ కోరుకుంది. మనలో కూడా ఇటువంటి ధోరణులే ఉంటాయి. మనం ఉన్నదానికన్నా భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దీని ఫలితంగా, అర్జునుడిలా నిరాశనూ, నిస్పృహను ఎదుర్కొంటూ ఉంటాం. గులాబీ తన రంగును, పరిమాణాన్నీ, ఆకృతినీ మార్చుకోగలదు. కానీ అది అప్పటికీ గులాబీగానే ఉంటుంది. అదే దాని
స్వధర్మం
దృష్టి కోణం

కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం విశేషత్వాన్ని సంతరించుకుంటుంది. దీన్నే 'గురి కుదిరితే గులకరాయైనా గుడిలో దైవంలా కనబడుతుంది' అంటారు తత్వజ్ఞులు సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి, ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది. అప్పుడు వాటిని తేలిగ్గా చూడటం, సులభంగా పొందడం, మామూలుగా దగ్గరకు చేరడం కుదరదు.

చెట్టు నుంచి కోసి తినే పండు కడుపు నింపుతుంది. దానితో ఒక్కరి ఆకలి మాత్రమే తీరవచ్చు. అంతకంటే మరే అనుభూతినీ ఇవ్వదు. అదే పండును దేవుడికి నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది. చిన్న ముక్కలుగా చేసి ఎందరికి పంచినా స్వీకరించే వారందరికీ 'భగవంతుడి అనుగ్రహం పొందగలిగాం' అనే అనుభూతికి లోనయేట్టు చేస్తుంది. ఆ తృప్తి జీవితాన ఉత్సాహాన్ని నింపుతుంది. ఏ ఆశయం లేకుండా గంగానదిలో స్నానం చేసినా, అది సాధారణ స్నాన జలమే అవుతుంది. మామూలు చోట స్నానం లాగానే అక్కడా స్నానం చేసేవారికి

అంతకంటే అందులో ఏ ప్రత్యేకతా కనిపించదు. గంగ నుంచే కాకుండా ఏ ఇతర జల వనరు నుంచి తెచ్చిన నీటినైనా శంఖంలో పోస్తే అది తీర్థం అనిపించుకుంటుంది. పవిత్రమైనదనే భావనను కలిగిస్తుంది. చుక్కలుగా అరచేతిలో పడిన ఆ ఉద్ధరిణెడు బిందువులనే 'తీర్థప్రసాదం' అంటారు. అది స్వీకరించిన వారికి మనోబలాన్ని పెంచుతుంది సంతృప్తిని ఇస్తుంది. సాధారణ గరిక(గడ్డి)నే వినాయక చవితి నాడు ఆయనకు పూజాద్రవ్యంగా సమర్పిస్తే పవిత్రతను సంతరించుకుంటుంది. విఘ్నేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పత్రిగా ప్రసిద్ధి పొందింది. ఆ

రోజుల్లో సైతం ఒకే రోజు ఒకరికి స్మరణ దినం. మరొకరికి సంబరదినం, ఇంకొకరికి పర్వదినం కావచ్చు. ఆయా వ్యక్తుల అనుభవాలు, అనుభూతులే దాన్ని నిర్ధారిస్తాయి. మనిషి జీవితం కూడా అంతే. సాధారణంగా గడుపుతూ పోతే కాలమే గడిచి పోతుంది. కొన్నాళ్ళకు ఆయువూ తీరిపోతుంది.

అదే మనిషి ఏదైనా ఘనత సాధిస్తే, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటే... మహనీయుడు, స్ఫూర్తిదాత, మార్గదర్శి ఆదర్శ పురుషుడు... ఇలా ఎన్నో అవుతాడు. పదవి, అధికారం లాంటివి వచ్చిన వారు నిన్నటి వరకు నీతో కలిసి మెలిసి తిరిగిన వారే కావచ్చు. కానీ ఒక రోజులోనే మీ మీ స్థానాల్లో చాలా తేడా వచ్చేస్తుంది.

'మరి అలాంటప్పుడు అందరికీ ప్రసాదం, తీర్థం దొరుకుతాయా... అందరూ పండుగ చేసుకోగలరా, అందరూ మహనీయులు కాగలరా?' అనే ఆలోచన రావచ్చు. అందుకోసమే నీటినంతటినీ తీర్థంగా, తీర్థంగా, పదార్థాలనన్నింటినీ భగవత్ప్రసాదంగా, ప్రతి రోజునూ పండుగలా చూడటం అలవాటు చేసుకోవాలి. అది మనోభావన మీదే ఆధారపడి ఉంటుంది అంటారు బోధకులు, సాధకులు.

అలా ప్రతి పదార్థాన్నీ ప్రసాదంగా భావించిన నాడు దుబారా, దుర్వినియోగం తగ్గుతాయి. ప్రతి నీటినీ తీర్థంగా భావించిన నాడు నీటిని కలుషితం చేయడానికి వెనకాడతారు. ప్రతి రోజునూ పండుగగా భావించిననాడు మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా అనుకూల భావనలతో జీవిస్తారు. తోటి వారందరినీ భగవత్స్వరూపులుగా భావించిన నాడు లోకంలో విద్వేషాలు, విభేదాలు లేకుండా 'వసుదైక కుటుంబం' అనిపించుకుంటుంది. అప్పుడు 'స్వర్గమంటే ఎక్కడో లేదు. ఆ లోకం ఇదే' అనిపిస్తుంది. 'దృష్టి కోణం మారితే, సృష్టి కోణం మారుతుంది' అనే మాటకు అర్థం ఇదే.
దీనికి అహంకారం?

నిత్య వికాసమే జీవితం. అహంకారం, సంకుచితత్వమే మరణం. సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభం అహమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనే స్థానం అన్నది ఉపనిషత్ వ్యాఖ్య. నేను, నాది నావారు, పెరవారు అనేభావన చాలా ప్రమాదకరమని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి. స్వార్థపరత్వమే అహంకారానికి ప్రాతిపదిక. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రపుటల్లో అహంకారంతో విర్రవీగినవారి గురించి చదువుకొని తెలుసుకున్నాం. అయినా అహంకరిస్తూనే ఉన్నామంటే మనిషి ఎంత బలహీనుడో అర్థం అవుతుంది. రామాయణం చదివి, రావణుడిలా ప్రవర్తించే మానవులనెందరినో మనం చూస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణుడి గురించి తెలిసి కూడా అసూయా ద్వేషాలతో ప్రవర్తించి అసువులు బాసిన శిశుపాలుడు అసూయా గర్వాలకు మరో పేరు. అయినా ఈ మానవ సమాజంలో శిశుపాలుడి లాంటివారు నేటికీ కనిపిస్తూనే ఉన్నారు.

మంచి చెప్పేవారే మనవారు. మన మేలుకోరేవారు నిస్వార్థపరులు. మనం చెడిపోతే సంతోషించేవారు స్వార్థపరులు. ఇలాంటివారిలోనే అహంకారం నిండి ఉంటుంది. ఫల్గుణుడు, శ్రీకృష్ణుడు ఎంతోకాలం సన్నిహితులుగా మెలిగారు. రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి గీతను బోధిస్తున్నప్పుడు పార్థసారథి తన చెలికాడే కదా... ఈయన చెప్పేది తానెందుకు వినాలని కౌంతేయుడు భావించి ఉంటే బహుశా మహాభారత యుద్ధం సంభవించేదే కాదేమో! ధీరులు అంటే కండబలం ఉన్నవారు కానేకాదు. సమర్థులై, వివేకం కలిగినవారే ధీరులు. సమర్థత ఉంటే కార్యసాధకులవుతారు. అశోకుడి జీవిత చరిత్ర గమనిస్తే చకితులం అవుతాం. కండ బలంకన్నా అతడి మస్తిష్కం గొప్పది. అందువల్ల అతడెన్నో యుద్ధాలను జయించగలిగాడు. అతడి బలహీనత రాజ్యకాంక్ష. ఆలోచనలు మాత్రం గొప్పవి. జయాపజయాలు ఇహానికి సంబంధించినవని శాంతిలోనే ధర్మం ఉందని గ్రహించాడు. అందుకే కళింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం వివేకం మేలుకొని గౌతమ బుద్ధుడు చెప్పిన పథంలో నడిచాడు.

సమర్థులైన కార్య సాధకులను అదృష్టం వరిస్తుంది. దిగంతాలను తాకే ధైర్యోత్సాహాలతో భగీరథుడిలా సర్వుల మేలు కొరకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారు అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. బలవంతుడ నాకేమని పలువురితో అహంకరిస్తూ పలకడం మేలుకాదు... ఎందుకంటే బలవంతమైన సర్పం చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.

చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.

మనం మంచిని సాధన చేస్తే మంచివాళ్లమే అవుతాం. అనవసరంగా అహంకరిస్తూ అసూయతో జీవిస్తే శక్తిహీనులమవుతాం. మోహన్దాస్ కరంచంద్ గాంధీ బక్కపలచనివాడు. కానీ... మహా తేజోవంతుడు. ఆత్మబలాన్ని ఉదృతం చేసుకొని లక్షలాది ఆంగ్లేయులతో శాంతియుద్ధం చేశాడు. చివరకు మువ్వన్నెల జెండా ఎగరనే ఎగిరింది. సౌశీల్యంతో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే ధీశక్తి.

అహంకారం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషం లాంటి భయానక జ్వాలకు అదే కారణం. గుణాల్లో కెల్లా ఉత్తమమైంది ప్రేమ. అందరినీ ప్రేమించగలిగితే అహం అనేదే ఉండదని బుద్ధుడి బోధ. అహం అసహనానికి కారణం అయితే, ప్రేమ సుగుణాలకు మూలం. ప్రేమ అనే యశస్సు ముందు అహం అపకీర్తి పాలవుతుంది!
అవకాశమే ఆయుధం

మనిషిని బతికించే మధురసాయనం లాంటి మహాశక్తి- ఆశ. అది మరణశయ్యపై నుంచీ లేపి మళ్ళీ నడిపించగల మహామంత్రం. మనిషిని నిట్టనిలువునా చీల్చి మసి చేసే మారణాయుధం- నిరాశ. అది ఎంతటి శక్తిమంతుడినైనా దుర్బలుణ్ని చేసే
మహమ్మారి. ఏ రంగంలోనైనా జయాపజయాలు, కష్టసుఖాలు సహజం.

ఎదగాలనుకున్నవారికి ఎదురుదెబ్బలు తప్పవు. ఓరిమితో తట్టుకుని నిలబడాలి.

దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు. తగిలిన ప్రతి గాయాన్ని ఓపికతో మాన్పుకొని మళ్ళీ ప్రయత్నం కొనసాగించాలి. మధుర పదార్థం మోతాదుకు మించి స్వీకరిస్తే వెగటు పుడుతుంది. విజయాలకే అలవడిన జీవితానికి ఓటమి బాధ తెలియదు. అందుకే ఎప్పుడైనా పరాజయం ఎదురైనా కుంగిపోకూడదు. కష్టాల్ని
అనుభవించాలి. రాటు తేలాలి. ఓటమి కాటుతోనే గెలవాలన్న కసి, పట్టుదల మొదలవుతాయి. పరాజయాన్ని డీ కొట్టి స్థిరంగా నిలిచినప్పుడు, కష్టాన్ని తట్టుకుని సుఖానికి ఎదురుచూసినప్పుడు- వాటి శక్తి తెలుస్తుంది. వీటికి తగిన ప్రణాళికల్ని సిద్ధంచేసుకోవాలి. అహరహం శ్రమించాలి. ఎత్తుకు వైయెత్తులు వెయ్యాలి. చాణక్యుడిలా గెలుపు సూత్రాన్ని సొంతం చేసుకోవాలి. విజయ కంకణధారుల ధాటికి తలవంచి ఓటమి పలాయనం చిత్త గిస్తుంది. చిమ్మచీకటిలో పొరుగూరికి బయలుదేరాడో వ్యక్తి దారిలో కుంభవృష్టి మొదలైంది. రక్షణ కోసం ఓ చెట్టునీడకు చేరాడు. ఆ పక్కనే ఓ దిగుడు బావి. జారి అందులో పడిపోయాడు. ప్రాణా లపై ఆశ కోల్పోయి చీకట్లో కాలం. గడిపాడు. తెల్లవారింది. వర్షం తగ్గింది. బయటపడే మార్గం కనపడలేదు. ఇంతలో ఈదురుగాలికి చెట్టుకొమ్మ బావిలోకి ఒరిగింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదా వ్యక్తి, మూడు, నాలుగు సార్లు ప్రయత్నించాక కొమ్మ పట్టుకుని పైకి వచ్చాడు. దైవానికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోయాడు. జీవితంలో యాదృచ్ఛికంగా లభించిన అవకాశాల్ని తెలివిగా దక్కించుకున్నవారే విజ్ఞులు, తగిన కృషి, పట్టుదల, విశ్వాసం, దైర్యం- ప్రయత్నానికి తోడవ్వాలి. అప్పుడు విజయం తలవంచి దాసోహమనక తప్పదు.

అవకాశాలు తమంత తాముగా మన చెంతకు చేరవు. మనం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. చేజిక్కించుకుని కార్యనిర్వాహణలో విజయం సాధించాలి. మనలోని ఆసక్తి, శ్రద్ధ గమనించిన వివేకులు కొందరు తమ చెయ్యి అందించి అవకాశాల బాటలు పరుస్తారు. ఆ చేతులను బలంగా పట్టుకుని ఎగబాకి ఆ బాటలో విజయ ధ్వజాన్ని నాటాలే గాని, జారిపోకూడదు. స్వశక్తితో ఇతరులను ఒప్పించి మెప్పించాలి. విజయపరంపరను ఖాతాలో జమచేసుకోవాలి. వేలు వంచనిదే వెన్న అయినా దక్కదని గ్రహించాలి. అనుభవాన్ని, తెలివిని, శక్తిని కలగలుపుకొని గడ్డిపోచలను బలిష్టమైన పలుపు తాడుగా మార్చుకోవాలి. చేతికందిన అవకాశాల్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా పరహితంగా ఉపయోగించాలి. వాటి ఫలితాలు లోకకల్యాణానికి ఉపకరించిననాడు పరమార్థం నెరవేరినట్లే. పూలబాటలో తాము నడుస్తూ పదిమందినీ తమతో నడిపించాలి. దానం, ధర్మం, సమాజసేవ నిర్వహించే అవకాశం చేతికందినప్పుడు పరమాత్మ ఆదేశంగా స్వీకరించి ఇతరుల సంక్షేమానికి నడుంకట్టేవారు ధన్యజీవులు.
ఆనందయోగ గణపతి

సమస్త ప్రకృతిలో చరాచరాత్మక సృష్టిని ఎవరు నిర్వహిస్తున్నారో ఆ పరమేశ్వర చైతన్యమే గణపతి. రూప జగత్తుకు, శబ్ద ప్రపంచానికి గణపతే అధిపతి అని వేదం ప్రకటించింది. ఏ రూపమూ లేని పరబ్రహ్మకు ఆకృతి లభిస్తే ఆ రూపం గణేశుడిగా తేజరిల్లుతుందని ఉపనిషత్తు వాక్కు. గణేశుడిని సూచించే 'గీకారమే మంత్ర బీజాక్షరం. సకల దేవతల చేత పూజలందుకొనే గణపతిని వేదం 'బ్రహ్మణ సృతి'గా ప్రస్తావించింది. 'గణం' అంటే సమూహం. అనేక గణాల మేలు కలయిక అయిన ఈ సృష్టిని నడిపే లోక నాయకుడు గణాధిపుడు: 'ఓం'కారంలో గణపతి రూపాన్ని దర్శించి, సృష్టి రచనాదక్షతను బ్రహ్మ పొందాడంటారు. అ, ఉ, మా- అనే మూడు అక్షరాల సమ్మిళితమైన ఓంకారాన్ని ఆశ్రయించి గణపతి వెలుగొందుతున్నాడని ముద్గల పురాణం విశ్లేషించింది. ఈ మూడు అక్షరాలు సృష్టి స్థితి, లయ అనే ప్రక్రియను- జాగృత, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను సంకేతిస్తాయి. శక్తి, యుక్తి, ఐశ్వర్యం, ఆనందం అనే నాలుగు అంశాల పరిపూర్ణ గణపతి రూపం. గణేశుడి ఏనుగు ముఖం శక్తికి, సూచిక. ఆనందమే గణేశుడి రూపం అని శ్రీవిద్యార్థవ తంత్రం పేర్కొంది. మోదః అంటే ఆనందం. ఆనందకారకమైన మోద కాలను ఆహారంగా శివబాలుడు స్వీకరించి, వాటినే తన భక్తులకు అనుగ్రహ ఫలాలుగా అందిస్తాడు. ప్రకృతిపురుష భేదాత్మకు గణేశు అని గణేశ పురాణోకి ప్రకృతి అకృతే గణపతి. విశ్వమంతా రూపొందక ముందు, నిర్గుణ పరబ్రహ్మ ఉన్న అవ రూపమే- గణపతిగా ఆవిష్కృ తమైంది. ఒక్కటిగా ఉన్నప్పుడు అన్నీ ఆ స్వరూపంలో ఉన్నాయి. విడివడి ప్రపంచంగా రూపాంతరం చెందినప్పుడు అనేక దేవతా శక్తులుగా, గణాలుగా వ్యక్తమయ్యాయి. వేద సంప్రదాయం ప్రకారం మూడు ముఖ్య గణాలున్నాయి. అవి భూమి, అంతరిక్షం, దివి. ఈ మూడు గణాలు గణపతి అధీనంలోనే ఉంటాయి.

ఇంద్రియ ప్రాణాదుల రూపంలో ఈ గణాలు వ్యక్తుల భౌతిక శరీరంలోనూ సమ్మేళనమై ఉంటాయి. ఆ గణాల్ని జాగృతపరచే మహా చైతన్య స్ఫూర్తి గణపతి. అనేకంగా వ్యాపించి ఉన్న గణాల్ని ఏకోన్ముఖంగా ప్రాణశక్తిగా ఆత్మదీప్తిగా ఎవరు ప్రజ్వలింపజేస్తున్నారో ఆ దివ్య సమ్మోహన రూపమే మహాగణపతి. విష్ణు తేజస్సు బ్రహ్మ యశస్సు, ఈశ్వరుడి ఓజస్సు ఏకీకృతమై విలసిల్లే విరాట్ మంగళమూర్తిగా విశ్వగణపతి ప్రకటితమయ్యాడు.

భాద్రపద శుద్ధ చవితిని అభయ వరద చతుర్థి అంటారు. ఈశ్వర తత్వాన్ని విష్ణునాశక స్వరూపంగా వినాయక చవితినాడు ఆరాధిస్తారు. కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో, అన్ని అవరోధాల్ని అధిగమించడానికి గణేశ చతుర్థినాడు విఘ్నేశ్వరారాధన నిర్వహిస్తారు. తుండం అంటే ఖండించడం. వజ్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి గణేశ్వరుడు. అభ్యుదయంలో, పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. మాయగా అడ్డువచ్చే వజ్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు- వరసిద్ధి వినాయకుడు. యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం- అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే గణపతి ఆరాధన. ఆయన నాలుగు వేదాల్లో ఆవరించిన వేదమూర్తి. ఆయన చతుర్భుజుడిగా బీజ, అండ, పిండ, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండే మహోత్కట గణపతి. చతుర్థినాడు ఉద్భవించిన చిన్మయ విదానందుడిగా, నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన 'చవితి దేవర'గా వినాయకుడు ప్రణతులు అందుకుంటున్నాడు. అందుకుంటున్నాడు. 'గజ వదనుడిగా 'జగదానంద తేజోమయ ఆనందరూపుడిగా జయకర, శుభకర వినాయకుడిగా చవితినాడు సాకారమవుతాడు. అనంత సౌభాగ్య సిరుల్ని అనుగ్రహించే ఆహ్లాదపూరితమైన గణేశారాధన పూర్ణత్వమైన ఆనంద యోగసాధన
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
2024/09/11 17:23:26
Back to Top
HTML Embed Code: