Telegram Web
సౌభాగ్యమిచ్చే విఘ్నేశ్వరి!

చైనాయకి. విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని.. పొరపాటున అనడం లేదు! స్త్రీరూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు. ఆ పేర్లే ఇవన్నీ. ఆలంపూర్, భువనేశ్వర్ లో స్త్రీలు సర్వసంపదలనిమ్మని చైనాయక వ్రతం చేస్తుంటారు..


పార్వతీదేవి తపస్సు చేసి, మహోన్నత వరంగా పొందిన తనయుడు వినాయకుడు. తనకంటూ నాయకుడు లేని, తానే లోక నాయకుడైన వినాయకుడు సర్వ స్వతంత్రుడు. 106 రూపాలతో, 16 విశేష రూపాలతో అలరిస్తూ 8 రూపాలతో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అమ్మ వారు ఓంకార రూపిణి. వినాయకుడూ ప్రణవ రూపుడే. ఓంకారంలా ఉందని కొందరంటే, గణపతే ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి. వినాయకుడు తన అంశేనని, మంత్ర, యంత్ర, తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ ఒక్కటేనంది. ఆదిపరాశక్తి. అందుకే వినాయకుణ్ణి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శక్తి గణపతి, లక్ష్మి గణపతి, గాయత్రీ గణపతిగా పూజిస్తున్నాం. ఈ గణపతులకు విడివిడిగా ఆలయాలూ ఉన్నాయి. లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పార్వతీమాత ఒడిలో చిన్న గణపతి ఉన్న విగ్రహాలు కోకొల్లలు, హంపీలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అంకము చేరి శైల తనయస్తన దుగ్ధములానువేళ..' తరహాలో తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలెన్నో ఉన్నాయి. లోకాన్ని అల్లకల్లోలం చేయమని..

తల్లి మాట మేరకు తండ్రినెదిరించి ప్రాణాలు

మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి. అంతే!

కోల్పోయాడు చిన్నిగణపతి. పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించి తన అవతారాలైన ఖంజ, కాళి, కరాళి, బగళ, ఛిన్నమస్త, ధూమవతి, ఆ జగన్మాతలంతా దేవతలను మింగేశారు. తట్టుకోలేక విష్ణ్వాది దేవుళ్లందరూ పార్వతిని స్తుతించి, ప్రసన్నం చేసుకుని, ఏనుగు తలను తెచ్చి, బాలునికి అతికించి, మళ్లీ బతికించారు. అదీ స్త్రీశక్తి, అదీ మాతృశక్తి, పురుషులంతా కలిసినా ఆ శక్తి రూపిణిని ఏమీ చేయలేక దాసోహమన్నారు. ఆ

తల్లిని సంతోషపెట్టడానికే శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి, గణాధిపత్యాన్ని కట్టపెట్టాడు. తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటూ లేకపోవడమే కాదు.. ఉన్నత స్థానమూ లభిస్తుంది. అందుకే గణపతి శివపార్వతులకు ప్రదక్షిణ చేసి.. తల్లిదండ్రుల పదోదకము బోలంగ వే దాకాశ గంగా మహాజలంబు మాతా పితలతో సమానత గనజాల

రఖిల గీర్వాణ చూడాగ్రమణులు అంటూ వారి విలువను లోకానికి తెలియచేశాడు. 'అమ్మ కడ సౌభాగ్యమడిగి మాకీయవా దేవాదిదేవా' అని స్త్రీలు వినాయకుని వేడుకుంటున్నారు. పార్వతి తదితర దేవతలతో కూడి సౌభాగ్యాన్ని, సంపదని, విద్యను, మంత్రవిద్యను, జవసత్వాలను అందిస్తున్నాడు. గణపతి స్త్రీ పక్షపాతి. అందుకే స్త్రీ దేవతా మూర్తులతో కూడి స్త్రీలకే ఎక్కువగా వరాలిస్తున్నాడు.

సంపదలిచ్చే వైనాయకి

వినాయకునిది పృద్వీ తత్త్వం. భూమాతతో కూడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాడు. అందుకే గణపతిని మట్టిరూపంలో పూజించమని, పంట ఫలం, ఇటు ఆరోగ్య బలం దక్కించుకోమంటోంది. శాస్త్రం.

వినాయకుడు పంచముఖుడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, పంచ కోశాలు, పంచ తన్మాత్రలే ఆ పంచ ముఖాలు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఏ శుభకార్యానికైనా తొలి ప్రార్ధన అందుకునే ఏకదంతుణ్ని పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు, ఎండుఫలాలు, బియ్యప్పిండి.. దేనితోనైనా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. జగమంతా కొలువై ఉన్న ఆ రూపాన్ని ఇలా తీర్చిదిద్ది పూజించి.. మనసులో నింపుకొంటే. అంతా శుభమే...
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వామనాయనమః

శ్రీమహావిష్ణువు స్థితికారకత్వ సంవిధానంలో అభివ్యక్తమైన అయిదో అవతారం వామనావతారం. ధర్మోద్ధరణ కోసం అవసరమైన సందర్భాల్లో తాను అవతరిస్తూనే ఉంటానని శ్రీహరి ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపులకు వరపుత్రుడిగా, వామనమూర్తిగా సాకారమయ్యాడు. వామనుడు ఆవిర్భవించిన ఈ ద్వాదశిని దివ్యద్వాదశి, విజయద్వాదశి, మహాద్వాదశి, బలిద్వాదశి, వామన ద్వాదశిగా వ్యవహరిస్తారు.
వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన, భవిష్య పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి ఇంద్రుణ్ని ఓడించి, బలిచక్రవర్తి స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసగణం దేవతల్ని హింసించసాగింది. దాంతో, దేవతల మాతృమూర్తి అదితి కలవరపడి శ్రీహరిని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడే దేవతల్ని రక్షించడానికి వామనుడిగా ఆవిష్కారమయ్యాడు. వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. బలిని వామనుడు ఆశీర్వదించాడు. ఆ బాలకుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడైన బలి, ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘నాకు ఎలాంటి అత్యాశ లేదు. కేవలం మూడడుగుల భూమిని మాత్రం ఇవ్వు చాలు’ అన్నాడు వామనుడు. వామనుడి ఆకృతిలాగానే అతడి అభీష్టం చాలా కురచగా ఉందని బలి భావించాడు. భూదానానికి సమాయత్తమైన బలిని, అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. ఇది విష్ణుమాయా విలాసంగా హెచ్చరించాడు. అయినా బలి శుక్రుడి మాట పట్టించుకోకుండా వామనుడికి ఉదకపూర్వకంగా భూదానం చేశాడు. మహాత్రివిక్రముడిగా ‘ఇంతింతై వటుడింతై...’ వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ఓ పాదంతో భూమిని, మరో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి, మూడో పాదం బలి శిరస్సుపై ఉంచి అతణ్ని రాక్షసజాతి ఆవాస స్థలమైన రసాతలానికి అణగదొక్కాడు. అదే సందర్భంలో బలి దాన గుణ వైభవానికి ప్రసన్నుడైన వామనుడు, అతణ్ని సుతల లోక రాజ్యాధిపతిగా నియమించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాన్ని అప్పగించాడు.
మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదుగుతాడు. నేను మహా చక్రవర్తిని, నేను గొప్ప దాతను, నేను కర్తను, నేను భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులుగా మిగులుతారని, అలాంటివారికి ఎప్పటికైనా ప్రతికూల పరిస్థితులు తప్పవని భగవద్గీత పేర్కొంది. బలి చక్రవర్తి విషయంలో ఇదే జరిగింది.
విష్ణువు దాల్చిన వామనావతారం ఎన్నో సందేశాల సమాహారం! సృష్టిలోని జీవులన్నీ బీజప్రాయంగా ముందు అణువంత ఆకృతి దాల్చి క్రమంగా వికాసం చెంది సమగ్ర రూపాన్ని పొందుతాయి. జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి విరాట్‌ రూపం వరకు వైవిధ్యంగా ప్రకటితమవుతున్నాయి. ఈ వైవిధ్య, వైరుధ్యాలకు పరమాత్మ సృష్టి రచనే కారణం. ఆత్మ అనేది అణువుకన్నా సూక్ష్మమైనది. అయితే ఆ ఆత్మ దివ్య జ్ఞానంతో ప్రకాశిస్తే, బ్రహ్మాండమంత స్థూలంగా విశ్వరూపాన్ని ధరిస్తుంది. జీవుడు తనలో ఉన్న ఆత్మశక్తిని గ్రహించి, ఆత్మోద్ధరణకు సర్వదా కృషిచేయాలి. తన ఆత్మను, పరమాత్మతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు వామనుడు త్రివిక్రముడిగా ఎదిగిన రీతిలో సూక్ష్మ స్థితి నుంచి సాధకులు క్రమంగా వృద్ధి పొందుతారు! ఇదే, త్రివిక్రమావతార సందేశం!
గంజాయి వనంలో...

మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువ పాలుంటుంది. దుర్గుణాల ప్రభావం ఇంకొందరిలో ఎక్కువగా ఉంటుంది. దానవుల్లోనూ ధర్మవర్తనులున్నారు. మానవుల్లోనూ ఆసురీ ప్రవృత్తిగలవారున్నారు. శ్రీరామ వనవాస సమయంలో సీతమ్మను అపహరించదలచిన రావణుడు మారీచుణ్ని బంగారు లేడి రూపం ధరించి, సీతను ఆకర్షించమని ఆదేశిస్తాడు. రామబాణ ప్రభావాన్ని లోగడ చవిచూసి గుణపాఠం నేర్చుకున్నవాడు కనుక రాముడి జోలికి వెళ్ళవద్దని, అతడు ధర్మ స్వరూపుడని మారీచుడు ఎంతగానో హితవు చెబుతాడు. తాను చెప్పింది చెయ్యకపోతే చంపుతానంటాడు రావణుడు. ఆ దుర్మార్గుడి చేతిలో చావడం కంటే ధర్మమూర్తి రాముడి చేతిలో చావడమే శ్రేయస్కరమనుకుని, విధిలేక మారీచుడు రావణుడి ఆనతికి తలొగ్గుతాడు. దానవ లక్షణం లేని మారీచుడు రామచంద్రమూర్తి ఆదర్శ వ్యక్తిత్వాన్ని గ్రహించిన ధార్మికుడు.
శ్రీరాముడి గురించి తెలిసిన విభీషణుడు అన్న రావణుడికి ఎంతగానో హితబోధ చేశాడు. విసిగి, రాముడి శరణు వేడుకున్నాడు. ధర్మమెటువైపు ఉంటే అక్కడే జయం లభిస్తుందని గ్రహించిన జ్ఞాని- విభీషణుడు.
ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పక్షాన ఉన్నా, ఏ వర్గాన ఉన్నా మంచిని మంచి అనే చెప్పుకొంటాం. చెడును చెడు అనే చెప్పుకొంటాం. విష్ణువును ద్వేషించడమే కాకుండా, దూషించడమే కాకుండా, శ్రీహరిని అహర్నిశలు స్మరించే ప్రహ్లాదుణ్ని, తన తనయుడని అయినా ఆలోచించక పుత్రవాత్సల్యాన్ని విస్మరించి, చిత్రహింసలకు గురిచేశాడు హిరణ్యకశిపుడు. రాముడి మీద అమితమైన వాత్సల్యమున్న కైకమ్మ మంధర దుర్బోధల వల్ల యుగయుగాల్లోనూ సర్వుల చేత దూషితురాలైపోయింది.
దానవ సాధ్వి మండోదరి భర్త రావణుడికి ఎంతగానో ధర్మబద్ధమైన సలహాలు ఇచ్చింది. అశోకవనంలో త్రిజట అనే రాక్షసి సీతకు ధైర్యం చెప్పి, తన స్వప్న వృత్తాంతం వెల్లడించి ఓదారుస్తుంది. కౌరవ సోదరుల్లో యుయుత్సుడు, వికర్ణుడు ధర్మ పరాయణులైన పాండవులనే సమర్థించారు. రాక్షసుడైనా బలిచక్రవర్తి తన దానశీలతతో కీర్తి గడించాడు. శల్యుడు కర్ణుడికి రథసారథిగా వ్యవహరించినా అర్జునుడి విజయానికే సహకరించాడు.
రాక్షస చక్రవర్తి బాణాసురుడి పుత్రిక ఉష శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుణ్ని ప్రేమించి, వివాహమాడింది. రాక్షస మహిళ హిడింబి కుమారుడు ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షం నుంచే పోరాడి వీరమరణం పొందాడు. వీరంతా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వారు.
భారతావని తపోభూమిగా, పుణ్యభూమిగా, ఆర్య భూమిగా విశ్వవిఖ్యాతమైంది. మునులు, తపోధనులు, యోగులు, అవధూతలు, ప్రవచనకారులు, ఆచార్యులు, విద్వాంసులు, కళాకారులు, సమాజ సేవకులు, నాయకులు, సుపరిపాలకులు... అసంఖ్యాకంగా ఈ భూమి మీద ఆవిర్భవించారు. జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు, చేస్తున్నారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన జ్ఞాన వాకిలిగా విరాజిల్లుతోంది మన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల జ్ఞాన భాండాగారమంతా అందుబాటులో ఉంది. దీన్ని జాతి తన జీవన ప్రస్థానంలో సమన్వయ పరచుకోవాలి. సత్సాంగత్యం ప్రభావం అపారం. సత్కథాశ్రవణ ఫలితం అనంతం. సద్గ్రంథ పఠన అభ్యాసం ఆవశ్యకం.
మానవత్వ పరిమళం

రెండక్షరాల ప్రేమకు- ఇతరులకు సాయం చేసే చేతులు ఉంటాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు పరుగులు తీసే పాదాలుంటాయి. ఆక్రందన వినగలిగే చెవులు ఉంటాయి. కష్టాల్ని ప్రత్యక్షంగా చూసే కళ్లుంటాయి. ఈ లక్షణాలున్న రెండక్షరాల ప్రేమను రెట్టింపు చేస్తే నాలుగక్షరాల మానవత్వం అవుతుంది. ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. విలువలు, మర్యాదలు, సంస్కృతి, సంప్రదాయాలు, సుఖాలు, దుఃఖాలు... అందరూ కలిసి పంచుకునేవారు. ఇంట్లో పెద్దవారు అనుబంధాలకు పెద్దపీట వేసేవారు. కలుషితాలను సైతం కలుపుకొనిపోయే నదీప్రవాహంలా మానవత్వంతో సాగిపోయే సమాజం ఉండేది.

జీవితంలో సాధించడం, అనుభవించడం, సాఫల్యం పొందడం అనేవి ముక్కాలి పీటకు మూడుకాళ్ల వంటివి. ఇందులో మొదటి రెండింటితోనే చాలామంది జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవిత సాఫల్యం సులువుగా లభించదు. దీనికి కావలసిన ముడిసరకు- ప్రేమ. దీన్ని పంచడం, పెంచడం, తిరిగి పొందడంలో సమత్వం ఆచరించాలి.

రమణ మహర్షి పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ, ఆదరణ చూపేవారు. జంతువులను, పక్షులను ప్రేమతో పలకరించి లాలించేవారు. తన చేతులతో తినిపించేవారు. అది చూసిన ఓ భక్తుడు 'భగవాన్! మేము మీ మాట కోసం, మీ చేతి ప్రసాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా, మా చూడరు. ఇది న్యాయమా?' అని దానికి రమణులు చిరు నవ్వుతో 'పశువులు, పక్షులు అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తాయి. ఏ కోరికలు, ఏ ప్రశ్నలు వాటికి ఉండవు.

అందుచేత వాటిని నేను సహజంగా ప్రేమిస్తాను. వాటి పట్ల మానవత్వంతో ప్రవర్తించడం నాకు ఇష్టం అన్నారు.

సాఫల్యం సాధించడానికి మానవత్వంతో పాటు, దాన్ని ప్రదర్శించడానికి ఫలితాలకు అతీతమైన ధైర్యం కావాలి. మరణించాక కూడా గుర్తుండి పోవాలంటే, చరిత్ర పుటల్లో రాయదగిన పనులు చెయ్యాలి. రాముడికి ఉడత చేసిన సాయం చిన్నదే. కానీ అది నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. పరోపకారమే పుణ్యమని, పరపీడనం పాపమని అష్టాదశ పురాణాల సారాంశం.

సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్నారు గురజాడ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరెసా ఆచరించి చూపారు. ఇతరులకు చేసే మేలే నిజమైన సంపద అన్నది మహమ్మద్ ప్రవక్త ప్రబోధం. నువ్వు జీవించడమే కాదు, సాటి వారిని కూడా జీవింపజేయాలని జీసస్ బోధించాడు. వీటన్నింటి అంతరార్థం ఒక్కటే- ప్రేమపూరిత మానవత్వం.

నేటికీ కుబేరులే కాకుండా సగటు మనుషులు ఎందరో ఎన్నో రూపాల్లో మానవత్వం కనబరుస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సమస్యలతో పాటు ప్రకృతి విపత్తులు, ప్రాణాంతక రోగాల సమయాల్లోనూ చేయూత ఇస్తున్న ఎంతోమంది అదృశ్య దానకర్ణులు ఉన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు జీవకారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

అయినవారికి మనం సాయం చేయడం మంచితనం. అదే అందరూ మనవారే అనుకుని చేసే సహాయం- మానవత్వం. సమస్త ప్రాణికోటినీ సమదృష్టితో చూడాలి. దానివల్ల ఎదురయ్యే సాఫల్య వైఫల్యాలను సమభావంతో స్వీకరించినప్పుడే అనిర్వచనీయమైన మానవత్వం పరిమళాల్ని వెదజల్లుతుంది.
విజయపర్వం

అనంత కాల వాహినిలో అనుక్షణం విలువైనదే. విలువైన కాలాన్ని విజ్ఞతతో వినియోగించుకుంటే విజయం తప్పకుండా వరిస్తుందని తెలిపే పర్వదినం ‘విజయదశమి’. ఈ పండుగ పేరులో రెండు అర్థాలున్నాయి. ఒక అర్థంలో విజయాన్ని ప్రసాదించే దశమీ తిథి అని అన్వయించుకోవాలి. రెండో అర్థంలో విజయాన్ని అందించే శమీ వృక్షం(జమ్మిచెట్టు) అని సమన్వయపరచుకోవాలి. ఈ రెండు అర్థాల్లోని విశేషాలు ఈ పర్వదినం నాడు కనిపిస్తాయి.

ఆరు రుతువుల్లో శరదృతువుకు ఎంతో పవిత్రత ఉంది. ఈ రుతువు ప్రారంభం కాగానే స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించే ఆకాశం, జలాశయాలు, వనాలు, దారులు మనోనిర్మలత్వానికి ప్రతీకలుగా దర్శనమిస్తాయి. రాత్రివేళలో పిండారబోసినట్లుగా ఉండే వెన్నెల, హృదయాలను ఆనందాల్లో విహరించే విధంగా మారుస్తుంది. తెల్లదనం మనిషిలోని పారదర్శకతకు చిహ్నంగా గోచరిస్తుంది. అందుకే పూర్వం చక్రవర్తులు, రాజులు రాజ్యవిస్తరణకు, దిగ్విజయ యాత్రలకు ఈ కాలాన్ని సముచితంగా భావించేవారని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో చెప్పాడు. శరదృతువులోని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో దశమీ తిథినాడు ఈ విజయ ముహూర్తం సంభవిస్తుందని సంప్రదాయం చెబుతోంది.

పూర్వం ద్వాపరయుగంలో పాండ వులు అజ్ఞాతవాసారంభంలో తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టు(శమీవృక్షం) కొమ్మపై భద్రపరచారని మహాభారతం చెబుతోంది. ధర్మరక్షణ కోసం వినియోగించే దివ్యాయుధాలను శమీవృక్షం రక్షిస్తుంది కనుక మానవులంతా ఈ రోజున జమ్మిచెట్టుకు పూజలు చేయడం కనబడుతుంది. ఈ పవిత్ర పర్వదినాన శమీ దర్శనం, శకుంత(పాలపిట్ట) దర్శనం పుణ్యప్రదమనే నమ్మకం వ్యాప్తి చెందింది.

మనిషి తన జీవితంలో అడుగడుగునా విజయాలు కలగాలని, సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటాడు. తన జీవనయాత్ర విజయయాత్ర కావాలనే వాంఛకు ప్రతిరూపమే విజయదశమి. ఈ దినాన సాయం సంధ్యాకాలంలో ప్రజలు తమ తమ నివాసాల నుంచి బయలుదేరి ఊరి పొలిమేరల దాకా వెళ్ళి పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టును పూజించి తమ ఇళ్లకు తిరిగి వస్తారు. పాలపిట్ట విజయానికి సంకేతమైన పక్షి అని అందరి భావన. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్రోత్సవాలు ‘విజయదశమి’తో ముగుస్తాయి. నవనవోన్మేషంగా నవరాత్రుల పాటు సాగే ఈ శక్తిపూజల ముగింపు సంకేతమే ‘విజయదశమి’.

ప్రతి పండుగ వెనక సామాజిక, పారమార్థిక నేపథ్యం ఉంటుంది. సమాజంలో సహజీవన సౌందర్యానికి ప్రతిరూపాలుగా పండుగలు కనిపిస్తాయి. తాత్త్వికంగా ఆలోచించేవారికి దివ్యశక్తి ప్రేరణ రూపంలో పండుగ నిండుదనాన్ని సంతరించుకొంటుంది. మనిషి తన నిత్య జీవితంలోను, మరణానంతర జీవితంలోను ఉత్తమ స్థితినే కోరుకుంటాడు. అందుకే ధర్మార్థ కామమోక్షాల సాధనలుగా పండుగలను పెద్దలు నిర్వచిస్తారు.

జీవించినంత కాలం తాను, తన కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం అభ్యుదయాలను చూడాలని, క్షేమంగా ఉండాలని భావించే సంప్రదాయానికి ప్రత్యక్షరూపం ‘విజయదశమి’. ఈ పండుగ అందించే స్ఫూర్తి, మనిషిలోని ఆర్తిని తొలగించి, విజయకీర్తిని నిలపాలని ఆకాంక్షించడమే మనిషి కర్తవ్యం!

హితవచనాలు

పెద్దలు, అనుభవజ్ఞులైనవారి హితవచనాలు మంచి పనులకు ప్రేరణ కలిగిస్తాయి. మనిషిని మంచి మార్గంలో నడిపిస్తాయి. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని బోధిస్తాడు శతకకర్త వేమన. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం అనే సంపదలతో తులతూగే వ్యక్తిత్వం.


పెద్దలు, అనుభవజ్ఞులైనవారి హితవచనాలు మంచి పనులకు ప్రేరణ కలిగిస్తాయి. మనిషిని మంచి మార్గంలో నడిపిస్తాయి. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని బోధిస్తాడు శతకకర్త వేమన. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం అనే సంపదలతో తులతూగే వ్యక్తిత్వం. సంస్కారం కలవారు పెద్దలు ఎదురుపడగానే నమస్కరిస్తారు. మనిషి దేన్ని సాధించాలన్నా అనుభవజ్ఞులైనవారి సలహాలు, సూచనలు తప్పనిసరి. పెద్దలు చెప్పే సూక్తులు మనసులో నిక్షిప్తమై మనిషిని సరైన మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. మనిషి బతుకును తీర్చిదిద్దుతాయి.

రామాయణంలో ఆదర్శ పురుషుడు, పితృభక్తుడు అయిన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞలను పాటించడమే ధర్మాచరణగా భావించాడు. ఎవరి మాటనైనా శ్రద్ధగా వినేవాడు. తనవారిని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు. భారతంలో ధర్మరాజు చక్కని శ్రోత. కనిపించిన ప్రతి పెద్దమనిషినీ మంచిమాటలు చెప్పమనేవాడు. వారు చెప్పిన హితోక్తుల్ని తన ప్రవర్తనలో ఇముడ్చుకునేవాడు.

పుస్తక జ్ఞానంకన్నా అనుభవ జ్ఞానం గొప్పది. అనుభవం పాఠాలను నేర్పుతుంది. పెద్దలు తమతమ జీవితానుభవాలు రంగరించి పిన్నలకు సల హాలు, సూచనలు ఇస్తారు. వాటిని పాటించి వారు ధర్మమార్గంలో నడవాలి.

పూర్వం మహారాజులు, చక్రవర్తులు కూడా తమ పాలనను, ప్రవర్తనను సమీక్షించుకునేందుకు విధిగా కులగురువులు, మహర్షుల వద్దకు వెళ్ళేవారు. వారిని ఆశ్రయించి సూచనలను స్వీకరించేవారు. చివరకు సామాన్య ప్రజల అబి ప్రాయాలూ తెలుసుకుని తమ పాలనను విశ్లేషించు కుంటూ లోపాలను సరిదిద్దుకునేవారు. అందుకే ఎవరి దగ్గర గొప్ప ఆలోచనలు ఉన్నా స్వీకరించమని మనుస్మృతి చెప్పింది. ఆదర్శనీయమైన విలువల్ని ఆచరించమని బోధించింది.

మూర్ఖుడికి ఎలాంటి హితోక్తులు చెప్పినా వ్యర్థమే. అతడు తనకు తోచినట్లే వ్యవహరించి వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు. సీతాపహరణకు పాల్పడిన రావణుడితో విభీషణుడు ‘అన్నా! అనవసరంగా పోరు తెచ్చుకొంటున్నావు. ఇందులో మన సోదరి శూర్పణఖదే తప్పు... ఆమె మాటల్ని నమ్మి నువ్వు సీతాదేవిని అపహరించుకు రావడం అధర్మం. రాముడితో యుద్ధం సామాన్యం కాదు. సీతను మళ్ళీ రాముడి వద్దకు చేర్చి ఆయనను శరణు వేడుకో’ అని హితవు పలుకుతాడు.

తమ్ముడి మాటలతో రావణుడిలో కోపం తారస్థాయికి చేరుకుంది. ‘నువ్వు శత్రుపక్షపాతివి’ అంటూ విభీషణుణ్ని నిందించి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. చివరకు తన వినాశనం తానే కొని తెచ్చుకున్నాడు. వినేవాడు వివేకవంతుడైతే తన తప్పు తెలుసుకుంటాడు. తనను తాను సరిదిద్దుకుంటాడు. బుద్ధిహీనుడు అపార్థం చేసుకుంటాడు అంటారు పెద్దలు.

‘నీ జీవితాన్ని శ్రేయో మార్గం వైపు నడిపే దేనినైనా ఎలాంటి భేషజం లేకుండా వెంటనే అంగీకరించు’ అంటారు స్వామి వివేకానంద. పెద్దల మాటలు అమృతంతో సమానం. అవి మన జీవితాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఆ హిత వచనాలను వివేకంతో అర్థం చేసుకుని వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటాం. దానికి కావలసినది శ్రద్ధ, అవగాహన!

ఒకరికి ఒకరై...


ప్రతి జీవి శరీరంలో జీవకణాలు ఉంటాయి. అవి సమయోజనీయతతో సమన్వయంతో కలిసి ఉండకపోతే ఘర్షణ ఏర్పడుతుంది. ఫలితంగా సమతుల్యత లోపించి అనారోగ్యం పాలవుతామని శాస్త్రీయంగా నిరూపణ అయింది. అవి సవ్య, అపసవ్య దిశలలో కలిసి శరీరం సంకేతాలకు అనుగుణంగా సాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. లేకపోతే వ్యాధులకు గురవుతాం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, పరోక్షంగా ఎవరికి వారు సహాయం చేసు కోవడమే. ఈ రహస్యం తెలియని వాళ్లు ప్రతిదానికీ గొడవ పడతారు. కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు లాంటి చెడ్డ భావాలతో మనసును కలుషితం చేసుకుని బతుకుతుంటారు. ఆత్మాభిమానం అనే పేరుతో భీష్మించుకుని ఉంటారు. మనకు ఇంకొకరితో పనే ముందని గిరి గీసుకుని బతుకు తుంటారు. ఇది ఎవరికి వారు చేసుకునే ఎనలేని నష్టం. దీనివల్ల వారు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిస్సహాయులుగా మిగిలిపోతారు. ప్రకృతితో, సృష్టితో క్రమక్రమంగా సంబంధాలు తెగిపోయి, ఒంటరివాళ్లయిపోతారు. ఇంకొందరు సహాయం చెయ్యకపోగా, ఇతరుల మనసులను పనిగట్టుకుని గాయపరుస్తుంటారు. ఇందులో లేశమాత్రమైనా సందేహం లేదు. వారు ప్రకృతికి, సృష్టికి వ్యతిరేకంగా జీవిస్తున్నవాళ్లు. నిక్కచ్చిగా చెప్పాలంటే వారికి బతకడం రాదు. బతుకులో ఇమడలేరు. నిత్యం విమర్శలతో, నిందలతో, అననుకూల ఆలోచనలతో, పాలలాంటి బతుకులో విషం కలుపుకొంటూ ఉంటారు.

ఆత్మ అందరిలో ఉంది. అది ధరించే శరీరాలన్నింటితో కలిపి పరమాత్మ అయింది. ఆ పరమాత్మ, ఏకత్వ భావనతో అలరారుతోంది. ఏ జీవికి మనం సహాయ నిరాకరణ చేసినా, అది మనల్ని పరమాత్మతత్త్వానికి దూరం చేస్తుంది. సహాయం చెయ్యడంతోనే ఆధ్యాత్మికత మొదలవుతుంది. జీవుడు జీవుడికి సహాయం చెయ్యాలి. జీవుడు దేవుడికీ సహాయం చెయ్యాలి. దేవుడికి సాయమా అని అనుకోకూడదు. దైవం చేస్తున్న పనికి తనవంతు సాయం చెయ్యాలి... శ్రీరాముడికి ఉడుత చేసిన సాయంలా.

భౌతికమైన కంటికి, స్థావర జంగమాత్మక ప్రపంచం అంతా విడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి భిన్నత్వంలో ఏకత్వం ఉంది. చూసే చూపు మారితే రూపు మారుతుంది. మనసు మారుతుంది. మనుగడ తీరు మారుతుంది. ఎదుటివాడిని ఎందుకు ప్రేమించకుండా ఉండకూడదో, దాని వల్ల కలిగే హాని ఏమిటో అరటిపండు వలిచి పెట్టినట్లు అర్థమవుతుంది.

మనిషి భూమి మీదకు రావడం నుంచి, తనను తాను తెలుసుకొని, తనలోని దైవత్వాన్ని గుర్తించేవరకు ఎంతో సహాయం పొందుతాడు. ఇది అందరికీ తెలియదు. కాని... అది నిజం. ఈ దివ్యమైన ఆటలో పక్కవాడికి సహాయం చెయ్యడంలో గొప్పతనం, దివ్యత్వం ముందుగా ఎవరు గుర్తిస్తారో... వారే తమ ప్రయాణం చక్కగా సాగించి ధన్యులవుతారు!
భోజన నియమాలు
           
1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు. 
అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం. 

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు. 

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి. 

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు. 

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.
   
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.
  
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
 
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
  
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ  వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు)

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు. 
 
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం). 
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)   

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.) 

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము. 
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
                         
31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.
కీర్తి సంపాదన


కుండలను పగలగొట్టి అయినాసరే, బట్టలను చించుకొని అయినా సరే, గాడిదలా అరచి అయినా సరే, ఏదో ఒకవిధంగా అందరి దృష్టినీ ఆకర్షించే మనుషులు లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు అన్నాడు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది. అందరూ తననే చూడాలని, తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తాడు. ఇది అతడి బలహీనత. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడం కష్టం కనుక, చెడుపనులను అయినా చేసి ఏదో విధంగా అందరి కళ్లలో పడితే, తమకు విస్తృత ప్రచారం లభిస్తుందనుకుంటారు కొందరు.

బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడం కీర్తికండూతి అవుతుంది. కండూతి అంటే దురద. కీర్తి సంపాదన అనేది సహజసుందరంగా లభించేది అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది. బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఇతరులకు కాదు. లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తికోసం తపించలేదు. తాము నమ్మిన మంచిపనులను చేసుకుంటూ పోయారు. అలాంటివారు ఏదీ ఆశించకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. వారికి కీర్తిపై ఆసక్తి లేదు.

మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే ఒకసారి కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవడం అనేది ఒక పరీక్ష వంటిది. వచ్చిన కీర్తిని నిలుపుకోవడం కోసం శ్రమించవలసి వస్తుంది. ఇదంతా ఒక లంపటం కనుక కీర్తి కాంక్ష లేకుంటేనే మంచిదని వారు ఆశిస్తారు. కీర్తి కాంక్ష ఒక వ్యసనమే అని పెద్దల మాట. వ్యసనం మంచిదైనా, చెడుదైనా మనిషిని వెంటాడుతుంది. నిత్యం అశాంతికి గురి చేస్తుంది.

పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంత రాజులదాకా ఎందరో కీర్తికోసం తపించేవారు. దానశీలురుగా ప్రఖ్యాతిని పొందాలనుకొన్నవారు కొందరైతే, వీరాధివీరులుగా కీర్తిని గడించాలని కోరుకున్నవారు కొందరు.

నిత్యం ఎదుటివారిని పొగుడుతూ పబ్బం గడిపేవారు కొందరైతే, తాము ఇతరులను పొగిడి, ఇతరుల వల్ల పొగడ్తలను ఆశించేవారు కొందరు. ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మసంతృప్తిని పొందేవారెందరో కనిపిస్తారు. ఇలాంటివారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు- ‘ఒంటెల పెళ్ళికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ ఆహా! ఏమి మీ అందం? వర్ణనాతీతం’ అని పొగిడాయట. వెంటనే ఒంటెలు ఊరకుంటాయా? ‘ఓ మిత్రులారా! ఆహా! ఏమి మీ కంఠధ్వని... ఎంత మధురంగా ఉందో?’ అని ప్రశంసించాయట.

కీర్తికాంక్ష, కీర్తికండూతి... ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపం ఒక్కటే! ఒక రూపాయి దానం చేసి, వేయి రూపాయల కీర్తిని కాంక్షించేవారు కొందరైతే, కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు కొందరు! వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బతకాలి. ఎన్నో చేసినా, చేసింది అణుమాత్రమే అనుకోవడం మంచిది. నిజం కూడా అదే. మనిషి కీర్తికాముకుడు కాకూడదు. సహజ కీర్తి కిరీటధారి కావాలి!

దీపారాధన

దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం.


దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం.

పండగలు, పర్వదినాలు, పుష్కరాలు, వ్రతాలు, ఉద్యాపనలు, సభలు, సమావేశాలు, ప్రవచనాలు, భజనలు... ఇలా అనేక శుభ సమయాల్లో దీపప్రకాశనం చేస్తారు. ప్రధానంగా దేవాలయాల్లో కార్తికమాసమంతా మహిళలు దీపాలు వెలిగిస్తారు. పర్వదినాల్లో నదుల్లో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తారు. దీపదాన మహిమను పద్మపురాణం విస్తృతంగా వర్ణించింది. దీపదానం వల్లనే ‘గుణవతి’ త్రిమూర్తుల ఆశీస్సులందుకుని, మరుజన్మలో సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుణ్ని భర్తగా పొందిందని పురాణ కథనం. కార్తికమాసంలో వెలిగించే దీపాలు శీతల శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతనందజేసి, వ్యాధులను దూరం చేస్తాయంటారు. దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వులనూనె శ్రేష్ఠమైనవి.

దీపం నుంచి వెలువడే లేత ఎరుపు, నీలి, పసుపు రంగులను ముగురమ్మలకు ప్రతీకలుగా భావిస్తారు. దీపం ‘దేవతాస్వరూపిణి’ అని విశ్వసించడానికి గల తార్కాణం హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాదేవి ఆలయం. నూనె, వత్తులు లేకుండా వెలిగే అఖండ దీపం ఆ ఆలయంలో ఉంది. ‘తంత్ర చూడామణి’లో ఈ దేవి మహిమ వివరంగా ఉంది.

అమావాస్యనాడు సన్యసించిన స్వామి దయానంద సరస్వతి తిమిర జగతికి జ్ఞానకాంతిని అందించారు. చీకటిలో చేసే పనులన్నీ పాపాలుగాను, వెలుగులో చేసే పనులన్నీ సత్కార్యాలుగాను మహాత్ములు అభివర్ణిస్తారు. జాతిని జాగృతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే ఆవిష్కృతమవుతాయి.

మానవ శరీరం మట్టితో చేసిన ప్రమిద అని, ప్రాణం ప్రకాశించే జ్యోతి అని, ఆధ్యాత్మిక సాధన ఆ ప్రమిదలో పోసే తైలమని అందుకే భగవంతుడికి భక్తుడు చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని పౌరాణికులు చెబుతారు. భూమాత వేడిని భరించలేదనే ఉద్దేశంతో ఒక ప్రమిదలో మరో ప్రమిదను ఉంచి దీపం వెలిగిస్తారు. దీపకాంతి లోకానికి క్రాంతి, శాంతి ప్రసాదించి, భ్రాంతిని తొలగిస్తుందని హైందవ సంప్రదాయ విశ్వాసం. జ్యోతి ప్రకాశనం దివ్యలోక సాయుజ్యానికి దారి చూపుతుందంటారు. దీపం ఎప్పుడూ పై దిశవైపే చూస్తుంది. అలాగే మనిషి ఉన్నత స్థితికే వెళ్ళేందుకు ప్రయత్నించాలన్నది దీపం ఇస్తున్న సందేశం.

తులసి మొక్కను లక్ష్మీస్వరూపిణిగా భావించి, దానిముందు దీపం పెడతారు. దర్శనాల్లో దీపజ్యోతిని జ్ఞానసంకేతంగా ఉటంకించారు. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోక ఒక దీపం వెలిగిస్తే, అదే ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. రుగ్వేదం ‘అగ్ని’ అన్న పదంతోనే ఆరంభమైంది. అగ్ని అంటే జ్యోతి స్వరూపమే కదా! ముక్తిపథంలో ప్రయాణించడానికి జ్యోతి అనే సాధన ఒక్కటే సులువైనది కనుకనే దీపారాధనకంతటి వైశిష్ట్యం అని బుధులు చెబుతారు. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న సామెత మనిషి జీవన ప్రస్థానం ఎంతో అప్రమత్తతతో కొనసాగాలని హెచ్చరిస్తోంది.
అక్షర యజ్ఞం

అక్షరాలు వాక్కుగా మారి శబ్దరూపంలో ప్రయాణిస్తాయి. సచ్చిదానందరూపంగా అక్షరాన్ని మహర్షులు ఆరాధించారు. వాగ్దేవిగా కొలిచారు. సరస్వతిగా ఆరాధించారు. భాషలు వేరైనా భావప్రకటనకు అక్షరమే మూలాధారం. తెలుగులో యాభై ఆరు అక్షరాల వర్ణమాల తరతరాలుగా భాషాసంపదను అందించింది. పిల్లలకు అక్షరాభ్యాసం సనాతనమైన సంప్రదాయం. ఓం ప్రారంభించి, శ్రీకారాన్ని దిద్ది, నమశ్శివాయ అని అక్షరాలు దిద్దించే సంస్కారం కొందరిది. మరికొందరు ఓం శ్రీ, న, మ అని అభ్యాసం ప్రారంభిస్తారు. ఏ విధానమైనా అది అక్షర సుముహూర్తం.

ఒకే అక్షరంగా సృష్టికి మూలమై ఉద్భవించిన ప్రణవనాదం ఓంకారం. ఏకాక్షర బ్రహ్మగా వేదం వర్ణించింది. శూన్యంలో, సముద్రహోరులో, గాలి సవ్వడిలో, గుడిగంటలో ఏకాక్షర శబ్దం ఓంకారంగా వినిపిస్తుంది. అది పరమాత్మవాణి. అనేక ఇతర ఏకాక్షర శబ్దాలు ఉన్నా మోక్షసామ్రాజ్యానికి ఓంకారాన్నే ప్రామాణికంగా చెబుతారు. రెండు అక్షరాల మంత్రాలు అనేక స్తోత్రాల్లో కనిపిస్తాయి. అక్షరాలు ఎన్ని ఉన్నా మంత్రానికి ప్రాణం అక్షరంలోని బీజశక్తి. వాటినే బీజాక్షరాలు అంటారు. అన్ని ధాన్యపు గింజలూ మొలకెత్తవు. బీజశక్తి కలిగిన విత్తనాలే పునరుత్పత్తి చెందుతాయి. రామ, కృష్ణ, శివ, హరి, హర... లాంటి రెండక్షరాల మంత్రాలు బీజాక్షర సమాశ్రితాలు. ఓం నమః శివాయ పంచాక్షరి, ఓం నమోనారాయణాయ అష్టాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయలాంటి ద్వాదశాక్షరి... భగవన్నామస్మరణ కలిగించే తారక మంత్రాలు.

ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రి- ఆగమశాస్త్రం అంగీకరించిన వేదమంత్రం. వాల్మీకి మహర్షి తన రామాయణంలో గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరాన్ని వరస క్రమంగా వేయి శ్లోకాలకు ఒకటిగా వేసి ఇరవైనాలుగు వేల శ్లోకాలతో రచించాడు. ఆదికావ్యంగా, మోక్షాన్ని, సామాజిక ధర్మాలను ప్రసాదించే ఇతిహాసంగా తరతరాలుగా నిలిచే శక్తిని తరించుకోవడానికి ఇదే కారణంగా చెబుతారు. విత్తనంలో శాఖోపశాఖలుగా విస్తరించే మహావృక్షం దాగినట్లు అక్షరంతో మహోన్నతమైన అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. అక్షరం మనిషిని వివేకవంతం, సంస్కారవంతం కావిస్తుంది. అక్షర విన్యాసాలు అనేకం. అవి అనంతమైన కళారూపాలు. అఖండ విజ్ఞానభాండాగారాలు. దైవీస్వరూపాలు.

శతకాలుగా దర్శనమిచ్చిన అక్షర సంపద తరతరాలుగా మనిషికి వివేకజ్ఞానాన్ని ప్రసాదించింది. వేమనశతకం, దాశరథీ శతకం, కాళహస్తీశ్వర శతకం... లాంటి అనేక శతక కావ్యాలు మనిషికి మంచి మార్గాన్ని చూపించాయి. ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి చేర్చే సాధనాలుగా నిలిచాయి. పద్యంలోని కవితాత్మక అక్షరరూపాలు గుండెల్లో మధురానుభూతిని, రసానుభూతిని అందించాయి. తెలుగువారి పద్యకృషీవలుడు బమ్మెరపోతన భాగవత పద్యాలు సరస్వతికి అక్షర సుమహారాలు. ఆనంద ప్రేరకాలు. చమత్కారంగా ఒక కవి ఇలా వర్ణించాడు. పద్యం ఒక బంగారు పళ్ళెం. అంతర్యామి దానిలో వర్ణన, ఛందస్సు, సొగసు, కథాగమనం, అతిశయం, ఆర్ద్రత- వడ్డించిన మధుర పదార్థాలు. వాటిని ఆస్వాదించి, అనుభవించి బంగారుపళ్ళెం లాంటి పద్యాన్ని భద్రంగా దాచుకోవాలి. ముందుతరాలకు మన సంపదగా అందించాలి.

గ్రాంథికమైనా, వ్యావహారికమైనా వ్యావహారికమైనా అక్షరం ఆలోచనా సులోచనం. వాడి, వేడిగల అక్షరాల పదునుతో శిల్పంలా చెక్కి, సత్యం, ప్రియంగా అందాలను దిద్ది, నిజాన్ని నిర్భయంగా మలచి తీర్చిదిద్దిన వ్యాస పరంపర మనిషిని తప్పక మంచి మార్గంలో నడిపిస్తుంది. మంచి వ్యాసంలోని ప్రతి అక్షరం మనిషిని నిలదీస్తుంది. విచక్షణతో ఆలోచింపజేస్తుంది.

ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు... వీటి రూపేణా మానవ సమాజానికి హితం చేకూర్చే సంస్కరణే అక్షరయజ్ఞం. అక్షరం సంస్కృతీ సౌధానికి మహాద్వారం!
2024/08/17 06:55:10
Back to Top
HTML Embed Code: