Telegram Web
మళ్ళీ మళ్ళీ నువ్వుదాం

సుదీర్ఘమైన జీవితం కేవలం సుఖాలతోనో, కేవలం కష్టాలతోనో, నడవదు, ముగియదు. ఒక విత్తనం మొలకెత్తి పెరిగి, ఫలించి, పండి పడిపోయేందుకు కేవలం పండ్లు కాసి ముగిసిపోతే చాలదు, వీలు కాదు. చిగుళ్లు, ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పూలు, పండ్లు... ఎంత పరిణామ క్రమం! మళ్ళీ లోపల విత్తు. అది అసలు ససిని నిలుపుకొంటూ పునర్జన్మను, పునరుత్పత్తిని మేలుకొల్పుకొంటూనే ఉంటుంది. అదే ప్రకృతి. అదే పరిణామం. పాత మీద విరక్తి కలగకుండా, అంతరించిపోకుండా భగవంతుడు ఏర్పాటు చేసిన నిత్య నూతన పరిణామ క్రమం. ఈ ప్రక్రియ చెట్లు, పక్షులు, జంతువులకే కాదు- మనిషికీ వర్తిస్తుంది. వెల్లవేసిన, రంగులు పూసిన భవంతిలా లోకం యావత్తూ ఎప్పుడూ నవనవలాడుతూ రంగులమయంగా విపత్తులు... ఇవీ భగవంతుడి సృష్టే. నడక నేర్చుకుంటూ పసివాడు కిందపడతాడు. సైకిల్ నేర్చుకుంటూ పిల్లవాడు గాయాలు తగిలించుకుంటాడు. దానికి భయపడి పిల్లలు తమ సరదా మానుకోరు. లేచి దులుపుకొని మళ్ళీ పరిగెడతారు. జీవితంలో ఒడుదొడుకులూ అంతే. కష్టాలు, కన్నీళ్లు కూడా అంతే. కేవలం సుఖమే ఆనందాన్నివ్వదు. దాన్ని సంపాదించే క్రమంలో దెబ్బలు తగలాలి. ఇబ్బందులు కలగాలి. అప్పుడే ఆ ఆనందానికి పూర్ణత్వం మనిషి ప్రకృతిని చూస్తే పరవశించి పోతాడు. అమృతం తాగిన అనుభూతితో ఆనందపడిపోతాడు. ప్రకృతి ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. మళ్ళీ వర్షాలతో, జలపాతాలతో, పూలతో, పచ్చదనాలతో, పక్షుల కలకూజితాలతో, పులకింతలతో పరవశించిపోతుంది. అవును. జీవితం అంటే అదే. మనిషికైనా అంతే. ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు, ప్రకృతి

అంతర్యామి

జీవితం దాని సహజత్వాన్ని అది అనుసరించనీ. అనుభవించనీ. కాలం దాని సహజ వేగంతో అది సాగనీ, మనం అతి తెలివితో దాన్ని ఆపవద్దు. ఆగవద్దు. సహజత్వాన్ని ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం. మామిడి... పిందెలో ఒక రుచి. కాయలో అదో రుచి. దోర మామిడిలో మరో రుచి. పండులో అసలైన రుచి. మార్పులోని అందాన్ని, ఆనందాన్ని నేర్పిస్తోంది ప్రకృతి.

నిజమే. కష్టం ఉంటుంది. నష్టమూ ఉంటుంది. దానిలోని చెడును, చేదును తీసివేసి అసలు మంచిని ఆస్వాదిద్దాం. అనాదిగా మన పూర్వులు చేసింది అదే. కష్టం కేవలం కష్టమే కాదు. అందులో ఇష్టం కూడా ఉంది. అందుకే నవ్వుదాం. నవ్వి నవ్వి కన్నీళ్లొస్తాయి. తుడుచుకోవాలి కదా? అందుకు కొంచెం సమయం కావాలి కదా? ఇవ్వాలి కదా? కష్టం అలాంటిది. కన్నీళ్లు అలాంటివి. కన్నీళ్లు తుడుచుకుందాం. మళ్ళీ నవ్వుదాం. మళ్ళీ మళ్ళీ నువ్వుదాం!
చీకటి వెలుగులు

చుట్టూ చీకటి పరచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకలు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం.

కష్టాలు, ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కష్టకాలంలో ఆదుకునేవారుండరు. బంధువులు, మిత్రులు తప్పించుకు తిరుగుతారు. ఉన్నత స్థితి, సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైనవారు కాలం కలిసిరాగానే చేరువవుతారు. విమర్శించినవారే అభినందిస్తారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణసంపన్నుడు అందరి గౌరవం పొందుతాడు.

బాల్యంలో మనసు కల్మషరహితంగా ఉంటుంది. కౌమార, యౌవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు తోడవుతారు. స్నేహితుల ప్రభావం జీవనగమనంలో మార్పు తెస్తుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయ పథమనే ప్రకాశవంతమైన క్రాంతిమార్గంలో నడిపిస్తుంది. దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ప్రమాదకరం.

మనిషి తనను తాను తెలుసుకోవాలి. తన శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. జీవనపథంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్కరోజులో సంభవించేవి కావు. ఏళ్లతరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తాడు.

భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విజ్ఞులు తమ మేధను ఉపయోగించి సద్బుద్ధితో, స్వయంకృషితో తేజోవంతులవుతారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతులీనుతుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు. ప్రగతి ప్రతిబంధకాలు. అవి మేధను హరించి మనసును చీకటిమయం చేస్తాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోనట్లు, కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవని భాగవతం చెబుతోంది.

‘మనిషి ఆయుర్దాయంలో సగభాగం కారుచీకట్లతో కూడిన రాత్రివల్ల వృథా అవుతుంది. మిగిలిన సమయంలో కామక్రోధాదుల బంధంలో చిక్కుకుని బయటకు రాలేక సతమతమవుతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారమనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తాడు. శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం తాగి పరవశులు కాగలిగిన వారికి భగవంతుడి కృపవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలతోపాటు మోక్షం సిద్ధిస్తుంది’ అని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు.

భగవన్నామస్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారుచీకటిలోనూ కమలాక్షుడు అభయ ప్రదానం చేసి ఆదుకుంటాడు. శీతోష్ణస్థితుల్లో మార్పును దేహం తట్టుకున్నట్టే సుఖదుఃఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి. అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటివెలుగుల ప్రభావం ఉండదు. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని భగవంతుడి గీతోపదేశం.
ఆత్మగౌరవం

ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యున్నత పురస్కారం ఆత్మగౌరవం. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే మీరు ఇతరులను గౌరవించగలుగుతారు. వ్యక్తిత్వం తాలూకు ఉన్నతత్వాన్ని వ్యక్తపరచేది ఆత్మగౌరవమే. వ్యక్తి బాహ్య చర్యలను శాసించేది, నిర్ధారించేది ఆత్మగౌరవమే. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఏర్పరచుకునే మానవ సంబంధాలు చీకటిలో దీపం పరచే వెలుగులా ప్రకాశిస్తాయి. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమతో తాము పరిచయం పెంచుకుంటారు. తాము ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటారు సోక్రటీస్. ఆత్మగౌరవం గలవారు విలువలకు కట్టుబడతారు. మంచిశ్రోతగా ఎదుటి వారు చెప్పేది వింటారు. తమ ప్రవర్తనతోనే ఎదుటివారిలో పరివర్తన తెస్తారు. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఓ ఆణిముత్యం. స్వచ్ఛమైన తామర పువ్వులా వికసించిన వ్యక్తిత్వం ఆయనది.

ఆత్మగౌరవంగల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా కలిసిపోతారు. కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవ స్పృహ కలిగి చులకన చేస్తే అంతే త్వరగా విడిపోయి, దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే ఆపన్న హస్తం అందించడానికి ముందుకొస్తారు. నిస్వార్ధమైన సేవా తత్పరతతో తరతమ భేదాలకు అతీతంగా మానవ సంబంధా లకు పెద్దపీట వేస్తారు. తమలోని ప్రత్యేకతను గుర్తించి దాన్ని పదిమంది శ్రేయస్సుకు ఉపయోగించేవారు ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తులే.

ఆత్మగౌరవం గల వ్యక్తుల్లో ఆత్మ స్థైర్యం, నమ్మకం ఎక్కువగా ఉంటాయి. ఆ నమ్మకాన్ని అపజయాలకు, అన్యా యం, అక్రమాలకు బలి చేయరు. తమ నమ్మకాన్ని బతికించుకునే ప్రయత్నం చేస్తారు. అపజయాలు ఎదురైనా అవి తాత్కాలికమే అనుకుని ముందంజ వేస్తారు. ఓటమిని ఓడించి విజేతలయ్యేందుకే కృషి చేస్తుంటారు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు, సాధించిన విజయాలతో సంతృప్తి చెందరు. నిరంతరం ప్రయత్నిస్తూ, శ్రమిస్తూనే ఉంటారు. లక్ష్యం మారినా గమ్యాన్ని విస్మరించరు. ప్రేమించే హృదయం, స్పందించే మనసు, పని చేసే చేతులు ఆత్మగౌరవానికి ప్రతీకలు అంటారు స్వామి వివేకానంద.

ఆత్మగౌరవానికి ఆత్మజ్ఞానానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు ఆత్మజ్ఞానం వైపు దృష్టి సారిస్తారు. దేనినైనా స్వీకరించినంత తొందరగా త్యజించనూ గలరు. గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటివారు ఆత్మగౌరవానికి ఆత్మజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని మనమధ్యే సంచరించిన యోగులు.

ఆత్మగౌరవం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. మరొకరిని చూసిన ప్రేరణతో లభించేది. కాదు. ఆత్మగౌరవం ద్వారా ఆత్మజ్ఞానం పొందిన యోగులు తరతమ భేదాలకు అతీతంగా సృష్టిలో ఏ ప్రాణితోనైనా బంధాలు ఏర్పరచుకుంటారు, సంభాషిస్తారు, ఆదరిస్తారు. ఆత్మగౌరవం ద్వారా ఆత్మజ్ఞానం తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం "సిద్ధిస్తాయని రామకృష్ణ పరమహంస బోధించారు.
చీకటి వెలుగులు

చుట్టూ చీకటి పరచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకలు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం.

కష్టాలు, ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కష్టకాలంలో ఆదుకునేవారుండరు. బంధువులు, మిత్రులు తప్పించుకు తిరుగుతారు. ఉన్నత స్థితి, సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైనవారు కాలం కలిసిరాగానే చేరువవుతారు. విమర్శించినవారే అభినందిస్తారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణసంపన్నుడు అందరి గౌరవం పొందుతాడు.

బాల్యంలో మనసు కల్మషరహితంగా ఉంటుంది. కౌమార, యౌవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు తోడవుతారు. స్నేహితుల ప్రభావం జీవనగమనంలో మార్పు తెస్తుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయ పథమనే ప్రకాశవంతమైన క్రాంతిమార్గంలో నడిపిస్తుంది. దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ప్రమాదకరం.

మనిషి తనను తాను తెలుసుకోవాలి. తన శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. జీవనపథంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్కరోజులో సంభవించేవి కావు. ఏళ్లతరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తాడు.

భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విజ్ఞులు తమ మేధను ఉపయోగించి సద్బుద్ధితో, స్వయంకృషితో తేజోవంతులవుతారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతులీనుతుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు. ప్రగతి ప్రతిబంధకాలు. అవి మేధను హరించి మనసును చీకటిమయం చేస్తాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోనట్లు, కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవని భాగవతం చెబుతోంది.

‘మనిషి ఆయుర్దాయంలో సగభాగం కారుచీకట్లతో కూడిన రాత్రివల్ల వృథా అవుతుంది. మిగిలిన సమయంలో కామక్రోధాదుల బంధంలో చిక్కుకుని బయటకు రాలేక సతమతమవుతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారమనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తాడు. శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం తాగి పరవశులు కాగలిగిన వారికి భగవంతుడి కృపవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలతోపాటు మోక్షం సిద్ధిస్తుంది’ అని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు.

భగవన్నామస్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారుచీకటిలోనూ కమలాక్షుడు అభయ ప్రదానం చేసి ఆదుకుంటాడు. శీతోష్ణస్థితుల్లో మార్పును దేహం తట్టుకున్నట్టే సుఖదుఃఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి. అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటివెలుగుల ప్రభావం ఉండదు. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని భగవంతుడి గీతోపదేశం.
చిగురించే కాలం

తం ఒక మధురస్మృతి. వర్తమానం ప్రత్యక్ష దృశ్యం. భవిష్యత్తు ఆశల పల్లకి. కాలం ఒకటే అయినా ఇన్నివిధాల విభజనలు ఉన్నాయి. మనిషి కాలపంజరంలో బందీ అయిన చిలక.
మనిషి పుట్టుక నుంచి వెంటపడే కాలం, అతడు గిట్టేదాకా వెంటాడుతూనే ఉంటుంది. అతణ్ని వయోగణనం అనే చట్రంలో బంధిస్తుంది. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలను అంటగడుతుంది. మనిషి ఈ లెక్కింపునకు లొంగిపోతాడు. చేసేదేమీ లేక నిశ్చేష్టుడిలా ఉండిపోతాడు. అయినా కాలం అతణ్ని వదలిపెట్టదు. నిద్రిస్తున్నా, మేల్కొని ఉన్నా అతడి ఆయుర్దాయాన్ని లెక్కిస్తూనే ఉంటుంది. కాలం చేసే లీలలో, కాలం ఆడే ఆటలో మనిషి నిమిషాలను పట్టించుకోడు. గంటలను వ్యర్థంగా గడిపేస్తుంటాడు. రోజులు మారుతున్నా కదలడు. సంవత్సరాలైనా తన జాడ్యాన్ని వదలడు. చివరికి అతడికి తెలియకుండానే కర్పూరంలా ఆయుష్యం హరించుకొని పోతుంది.
సమర్థుడైన మనిషికి కాలం ఎంతో విలువైంది. ఒక్క గడియ కూడా వ్యర్థంగా గడవరాదనుకుంటాడు. ఎప్పుడు ఏది చేయాలో, అప్పుడు దాన్ని పూర్తి చేస్తుంటాడు. అసమర్థుడైనవాడు కాలాన్ని పట్టించుకోడు. కాలం అనేది గడుస్తోందనే స్పృహ కూడా అతడికి ఉండదు. చివరికి కాలం కరకు కోరల్లో పడి నలిగిపోతాడు.

కాలం ఎంతో మనోహరమైంది. అది తనకు అండగా ఉందనే ధైర్యంతో కృషి చేసే మనిషికి కాలం తోడుగా ఉంటుంది. కాలం ఒడిలో కూర్చొని, ఓనమాలు నేర్చుకున్నవాళ్లు ఉజ్జ్వల తారలై ప్రకాశించారు. వారు గతించినా వారి దివ్య దీప్తి చిరకాలం వెలుగులను ప్రసాదిస్తోంది. కాలంతో నేర్చుకున్న పాఠాలే భవిష్యత్తులో జ్ఞానపీఠాలపై మనిషిని కూర్చోబెడుతున్నాయి.
కాలం ఎప్పుడూ ఆశాకిరణమే. ఎంత దూరం సాగినా కాలం వెలుగులు ఆరిపోవు. కాలం మిగిల్చిన స్మృతులు పారిపోవు. మనిషి గతాన్ని స్మరించుకొని మురిసిపోతాడు. భవిష్యత్తును భావించుకొంటూ సాగిపోతాడు. నిన్నటి విజయం అందించిన స్ఫూర్తితో, నేటి కర్తవ్యం ఉత్సాహాన్ని నింపుతుంది. మనసు ఉల్లాసంతో ఉరకలు వేస్తుంది. అభ్యుదయ శిఖరాలకు సాగిపొమ్మంటుంది. చేదు అనుభవాలను కాలం తుడిచిపెడుతుంది. తీయని ఆశలను రేకెత్తిస్తుంది. కోరిన కోరికలకు దారి చూపుతుంది. కాలం వసంతంలా చిగురువేస్తుంది. గ్రీష్మంలా జ్వలిస్తుంది. వర్షంలా జల్లులను కురిపిస్తుంది. శరత్తులా వెన్నెల కాస్తుంది. హేమంతంలా వణికిస్తుంది. శిశిరంలా అన్నింటినీ రాల్చివేస్తుంది.
మనసులోకి దూరే కాలం మధురిమలను పండిస్తుంది. మండుతున్న ఎండల్లోనూ సాంత్వనల చిరు జల్లులను కురిపిస్తుంది. మనసు అనే లోకంలో మాధుర్యాల పంటలను పండిస్తుంది.

బాల్యంలోని మాధుర్యాలను వృద్ధాప్యంలో గుర్తుచేస్తుంది కాలం. గడచిపోయింది అంతా కమనీయమైందే అనే నిశ్చయాన్ని కలిగిస్తుంది కాలం. మళ్ళీ ఒకసారి గతంలోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కాలం!
సృష్టికి ఆదిలో, సృష్టికి అంతంలో ఒకేవిధంగా నిలిచే కాలం తనలో ఏ మార్పూ లేదని విశదం చేస్తుంది. మనిషి కూడా తనలాగే స్థిర భావనతో ఉండాలని సూచిస్తుంది. చిగురించే ఆశలతో బతకాలని చెబుతుంది. విజయం లభించేదాకా విరమించరాదని సంకేతం ఇస్తుంది. చెట్లులాగా ఫలోన్ముఖం అయ్యేదాకా నిలిచి ఉండాలని సందేశం ఇస్తుంది. కనిపించని కాలం కనబడే జగత్తును తనలో లీనం చేసుకోవడమే ఆశ్చర్యకరం.
తలలో నాలుకలా....


తెలుగు జాతీయాలలో ‘తలలో నాలుకలా’ అనే ప్రయోగం తరచుగా మనం వింటుంటాం. తలలో నాలుకలా ఉండటం ఏమంత సులభం కాదు. ఎవ్వరినీ శారీరకంగా, మానసికంగా నొప్పించకుండా, మంచి మాటలతో, సంస్కారవంతమైన ప్రవర్తనతో మెలగడమే దీని అంతరార్థం.

తెలుగు జాతీయాలలో ‘తలలో నాలుకలా’ అనే ప్రయోగం తరచుగా మనం వింటుంటాం. తలలో నాలుకలా ఉండటం ఏమంత సులభం కాదు. ఎవ్వరినీ శారీరకంగా, మానసికంగా నొప్పించకుండా, మంచి మాటలతో, సంస్కారవంతమైన ప్రవర్తనతో మెలగడమే దీని అంతరార్థం. నోటిలో మనకు ముప్ఫై రెండు పళ్లుంటాయి. ఆ కఠినమైన దంతాల మధ్య ఎంతో సున్నితంగా అటూ ఇటూ ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది నాలుక. దంతాల మధ్య ఎంత జాగ్రత్తగా మసలుతుందో నాలుక! చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఒద్దికగా, ఓర్పుతో, నేర్పుతో, ఒడుపుగా పళ్లదెబ్బ తగలకుండా ఉండే దాని నుంచి మనం నేర్చుకోవాలి, సమాజంలో ఎలా మెలగాలో! తినే పదార్థం రుచి దంతాలకు తెలియదు. నమిలే శక్తి నాలుకకు లేదు. పరస్పరం అవి సహకరించుకోవాల్సిందే! లేకపోతే తిన్న ఆహారం జీర్ణం కాదు. కొంత వయసు పెరిగాక క్రమంగా దంతాలు ఒక్కొక్కటే ఊడిపోతుంటాయి. నాలుక జీవితాంతం ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం అలా నాలుకలా ఉండాలి.
ఇలా శాశ్వతత్వం పొందాలంటే నాలుకను మంచిమాట మాట్లా డేందుకు ఉపయోగించాలి. శిష్టమైన భాషణం చేసేవాణ్ని ‘తలలో నాలు కలా ఉంటాడండీ’ అని మెచ్చు కుంటారు. అలాంటి మనిషి మనీషి అవుతాడు. మహామనీషి అవుతాడు. అతడి మాట వినమ్రతకు అద్దం పడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. తలపెట్టిన ప్రతికార్యంలోనూ సఫలీకృతుణ్ని చేస్తుంది. అజాతశత్రువును చేస్తుంది.

పాండవులు కేవలం ధర్మవర్తనులే కాదు, సున్నిత మనస్కులు. ఘోషయాత్రలో చేజిక్కిన దుర్యోధనుణ్ని విడిచిపెట్టారు. కృష్ణరాయభార ఘట్టంలో కృష్ణుడు పాండవుల మంచితనాన్ని, ధార్మికతను వ్యక్తం చేస్తూ ‘తలలోని నాల్కలు’ అని కీర్తిస్తాడు. పెద్దన్న అయిన ధర్మరాజును తమ్ముళ్లు నలుగురూ పల్లెత్తు మాట అనలేదు. ఎన్ని కష్టాలెదురైనా అన్నీ సహిస్తూ ఐకమత్యంగా ఉన్నారే తప్ప పరస్పరం కలహించుకోలేదు. ఎదుటివారిని తూలనాడనూలేదు. అంత అప్రమత్తతతో ప్రవర్తించడంవల్లనే అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకోగలిగారు. విరాట చక్రవర్తికి పలు సందర్భాల్లో తోడ్పడ్డారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఏడు అక్షౌహిణుల సేన వచ్చి పాండవుల పక్షాన నిలబడిందంటే- అది వారి సద్వర్తనమే అనుకోవాలి. అర్జునుడి మనసు ఎంత నవనీత సదృశమంటే కురుక్షేత్ర మైదానంలో విపక్షంలోని వారందరినీ చూసి ‘వారంతా నా బంధువర్గమే కదా! ఎలా సంహరించేది?’ అంటూ విలపిస్తాడు. కర్తవ్య బోధ, గీతాబోధతో పార్థుణ్ని యుద్ధ సన్నద్ధం చేస్తాడు వాసుదేవుడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలో తెలిసిన రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణపరమాత్మ. తలలోని నాలుక కాకపోతే అష్టపత్నులను, పదహారు వేలమంది గోపికలను, బంధువర్గాన్ని, ప్రజలను అంతగా సంతోష పెట్టగలిగేవాడా యదునాథుడు!
రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అడుగుజాడల్లో నడిచి, మంచి తమ్ముళ్లు అన్న ప్రఖ్యాతి పొందిన లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని మరువలేము. వారి భార్యలు ముగ్గురత్తల దగ్గర ఎంత వినమ్రతతో, ఆత్మీయతతో నడుచుకున్నారు!

తల్లిదండ్రుల్ని, గురువుల్ని గౌరవిస్తూ వినయవిధేయతలతో విద్య నేర్చి, మంచి ఆలోచించి, మంచినే మాట్లాడుతూ మంచి పనులు చేసే సంస్కారవంతుడు, అందరిలోనూ ‘నూటికో కోటికో ఒక్కడు’ అనిపించుకోగలవాడే తలలో నాలుకలా ఉండగలడు. ఒదిగే మనిషే ఎదుగుతాడని, పదుగురి ప్రశంసలూ పొందగలడని పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏది, ఎంత నేర్చినా ఇంకా ఎంతో ఉన్నదన్న సత్యం తెలుసుకోగలవాడే సమాజానికి ఆదర్శప్రాయుడై నిలవగలడు. సాటి మనిషికి ప్రసన్నత, ప్రశాంతత ఇవ్వగలవాడే సార్థక జన్ముడు.
అనన్య భక్తి

భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ.

భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ. ఏదైనా ఒక దేవతను గురించి ఇష్టాపూర్వకంగా ధ్యానిస్తూ, నిరతిశయమైన భక్తిని కలిగి ఉండటాన్ని రాగాత్మక/రాగానుగ భక్తి అంటారు.

విధి అంటే తప్పక చేయదగింది.దీనికే చట్టం, నియమం, శాసనం అనే అర్థాలున్నాయి. వైధిభక్తి అనేది బాధ్యత అనే భావనమీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం పొందడానికి తనవంతు బాధ్యతగా వినడం, కీర్తించడం, స్మరించడం సహా తొమ్మిదిరకాల బాధ్యతల్ని నిర్వర్తించడమే వైధిభక్తిలోని ప్రధాన నియమం. వాటినే నవవిధ భక్తిమార్గాలని పురాణాలు చెబుతున్నాయి. అవి- శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన ఎవరి శక్త్యానుసారం వారు నియమపూర్వకంగా అవలంబించి తరించే భక్తి మార్గాన్ని చూపుతాయవి.
వీటన్నింటి కంటే అతీతమైనది అనన్య భక్తి. మనసులో ఇతర ఆలోచనలకు చోటు లేకుండా భగ వంతుడి పట్ల మాత్రమే దృష్టి కలిగి ఉండటం దీని లక్షణం. దీనికే శుద్ధ భక్తి, ఏకాగ్రతా భక్తి అనే నామాం తరాలూ ఉన్నాయి. జగత్తులో దైవం తప్ప మరొకటి ఏదీ లేదు అనే విశ్వాసం కలిగి ఉండటమే అనన్య భక్తి అని వేదాంతులు చెప్పిన మాట. ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని వైదిక మంత్రం చెబుతోంది. ఇదే భావాన్ని పోతన ‘నీవే తప్ప నితఃపరంబెరుగ’ అని చెప్పాడు. కాబట్టి ఈ విశ్వమంతా భగవత్స్వరూపమే అనే భావాన్ని కలిగి ఉండాలి. ఏది చూసినా దైవస్వరూపమే అనుకోవాలి. ఏది చేసినా దైవసేవే, ఎక్కడ నడిచినా దైవప్రదక్షిణమే... అనే భావంతో జీవితాన్ని గడపాలి. ఇదే అనన్యభక్తి ముఖ్య లక్షణం.

దేవుడి సర్వవ్యాపకత్వం ఒక్కసారి అనుభవంలోకి వస్తే ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. అది భక్తిలో మొదటి లక్షణం. ఆ స్థితికి చేరిననాడు అందరూ దైవస్వరూపులే. కాబట్టి ఎవరినీ ద్వేషించకూడదు. ఏ జీవికి సేవచేసినా దైవసేవ చేసినట్టే. ఏ జీవిని తిరస్కరించినా దైవాన్ని తిరస్కరించినట్టే అని భావించగలగాలి. అదే అనన్య భక్తికి తొలిమెట్టు.

సర్వవ్యాపకత్వాన్ని అనుసరించడం చాలా కష్టం. అంతరాంతరాల్లో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. అదేమిటంటే... ఎదురుగా నా బంధువులు, ఆప్తులు, నా వాళ్లందరూ ఉన్నారు. వారందరినీ కాదని దేవుడినే నమ్ముకున్నానని తెలిస్తే, వాళ్లు చేసే ఆ మాత్రం సాయం కూడా చేయరేమోననే భయం. వాళ్లు కనీసం కనిపిస్తున్నారు. భగవంతుడు అలా కనిపించడు. ఎలా ఆదుకుంటాడు? ఇది వారి లోలోపలి అనుమానం.

ఈ భావాలు, భయాలు, అనుమానాలు అన్నింటికీ భగవంతుడే స్వయంగా పరిష్కారం చెప్పాడు. వేరే ఆలోచనలు లేకుండా, నిత్యమూ తననే నమ్ముకుంటే వారి యోగక్షేమాలను తానే చూస్తానని. కాబట్టి మనసును సర్వాంతర్యామి మీద స్థిరంగా ఉంచి, తన సర్వస్వాన్నీ ఆయనకు అప్పగించగలిగితే... నిస్సందేహంగా ఆ అంతర్యామి పరిష్వంగంలో జీవించగలం.
రోజూ పండుగే!

‘కలిగినవాడికి ప్రతిరోజూ పండుగే’ అనేది నానుడి. ఆ మాట ఎలా ఉన్నా, చాంద్రమాన గణనను అనుసరించే వారికి మాత్రం ప్రతిరోజూ పండుగే అని చెప్పవచ్చు. మాసానికి శుక్ల, కృష్ణ అని రెండు పక్షాలు.


‘కలిగినవాడికి ప్రతిరోజూ పండుగే’ అనేది నానుడి. ఆ మాట ఎలా ఉన్నా, చాంద్రమాన గణనను అనుసరించే వారికి మాత్రం ప్రతిరోజూ పండుగే అని చెప్పవచ్చు. మాసానికి శుక్ల, కృష్ణ అని రెండు పక్షాలు. రెండు పక్షాల్లోనూ పాడ్యమి మొదలు చతుర్దశి వరకు తిథులు సమానమే. శుక్లపక్షపు చివరి రోజు పౌర్ణమి. కృష్ణ పక్షానికి, ఆ మాసానికి సైతం చివరి రోజు అమావాస్య. శుక్ల, కృష్ణ పక్షాల్లో ఏ పక్షంలోనైనా పాడ్యమి మొదలు అన్ని తిథులు, వాటితోపాటు వారాలు, నక్షత్రాల కలయికతో వివిధ మాసాల్లో సందర్భానుసారంగా పండుగలు రావడం చాంద్రమానంలోని ప్రత్యేకత. చైత్ర శుక్ల పాడ్యమి నాడు తెలుగు సంవత్సరాది ‘ఉగాది’.

ఆదివారం విదియ తిథి కలిసిన రోజు ఏ మాసం/పక్షంలోనైనా ‘భాను విదియ’ అని పిలిచి సూర్యారాధన చేస్తారు. కార్తిక శుద్ధ విదియ ‘భ్రాతృవిదియ’గా ప్రసిద్ధం. ఆ రోజు సోదరి చేతి వంటను సోదరులు తినాలని నియమం. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. ఆ రోజు చేసే పూజ, దానం, వ్రతం ఏదైనా అక్షయమైన ఫలితాలను ఇస్తుందని ఈ పేరు పెట్టారు. భాద్రపద బహుళ తదియనాడు ఉండ్రాళ్ల తదియ/తద్దిగాను, ఆశ్వయుజ బహుళ తదియను అట్ల తదియగాను జరుపుతారు.

భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుతారు. ఏ మాసంలోనైనా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున సూర్యాస్తమయ సమయానికి చవితి ఉంటే సంకష్టహర / సంకటహర చతుర్థి అంటారు. ఆషాఢ శుద్ధ పంచమి సుబ్రహ్మణ్య ఆరాధనకు ఉద్దేశించిన స్కంద పంచమి. భాద్రపద శుద్ధ పంచమినాడు సప్తర్షులను పూజించే దినం రుషి పంచమిగా జరుపుతారు. మాఘ శుక్ల పంచమి సరస్వతీ దేవి జన్మదినోత్సవంగా జరిపే శ్రీ పంచమి లేదా వసంతపంచమి. ఆషాఢ శుద్ధ షష్ఠి కుమార షష్ఠిగా, మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఉద్దేశించిన పర్వదినాలు.
మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి. ఏ మాసం/పక్షంలోనైనా ఆదివారం సప్తమి కలిస్తే భానుసప్తమిగా వ్యవహ రిస్తారు. ఈ రోజుల్లో ప్రముఖంగా సూర్యారాధన చేస్తారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి. ఆశ్వయుజ శుక్ల అష్టమి మహాష్టమి. వీటిలో మొదటిది శ్రీకృష్ణ జన్మదినం. రెండోది శరన్నవరాత్రుల్లో దేవీ పూజకు ఉద్దేశించినది. వసంత నవరాత్రుల్లో చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా జరుపుతారు. శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా దేవీ పూజ చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమినాడు దసరాగా వ్యవహరించే విజయదశమి.

ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రసిద్ధం. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అనీ పిలుస్తారు. మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కార్తిక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి. తులసిని, విష్ణువును పూజిస్తారు. శనివారం త్రయోదశి కలిస్తే శనిత్రయోదశి, శని అనుగ్రహం కోసం తైలాభిషేకం చేస్తారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి. పౌర్ణమి రోజును శ్రావణ, కార్తిక, మాఘ మాసాల్లో పర్వదినాలుగా జరుపుతారు. ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి అమావాస్యగా, ఫాల్గుణ మాసపు అమావాస్యను ‘కొత్త అమావాస్య’(ఉగాది ముందురోజు)గా జరుపుకొంటారు.
భగవంతుడికి తెలుసు

సరైన అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వరు. వయసు, సద్గుణాలు, పోషించే సమర్థత చూడకుండా కన్యాదానం చేయరు. నమ్మకం పొందని వ్యక్తికి రుణం ఇవ్వరు.పాత్రత లేకుండా మంత్రోపదేశం చేయరు. సాధారణ విషయాల్లోనూ చాలా సందర్భాల్లో ఏదైనా పొందాలంటే పాత్రత ఉండాలి.

సరైన అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వరు. వయసు, సద్గుణాలు, పోషించే సమర్థత చూడకుండా కన్యాదానం చేయరు. నమ్మకం పొందని వ్యక్తికి రుణం ఇవ్వరు.పాత్రత లేకుండా మంత్రోపదేశం చేయరు. సాధారణ విషయాల్లోనూ చాలా సందర్భాల్లో ఏదైనా పొందాలంటే పాత్రత ఉండాలి. నిత్యజీవితంలో అందరి ఆదరాభిమానాలు పొందాలన్నా కూడా అర్హత సంపాదించాలి. దానికి ఒక క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరించాలి. వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇతరుల తప్పులను ఎంచడం మానాలి. నీ తప్పును తెలుసుకొని, ఇతరుల గొప్పను నిజాయతీగా ఒప్పుకోవాలి. సంకోచమే మరణం, వ్యాకోచమే జీవితం అంటారు. మానసిక పరిధిని విస్తృతపరచుకొని విశ్వ మానవుడు కావాలి. నిస్వార్థంగా ఇతరులకు ఏమి ఇవ్వగలమో అవి ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే పొందే అర్హత కలుగుతుంది.

భగవంతుడి అనుగ్రహం లభిం చాలన్నా అర్హత కావాలి. ఈర్ష్య అసూయ ద్వేషాలకు దూరంగా ఉండగలగాలి. ఆయన మీద భక్తి విశ్వాసాలు ఉండాలి, మానసిక అనుబంధాన్ని పెంచుకోవాలి. చేసే ప్రతి పని తాలూకు ఫలితాన్ని ఆయనకు సమర్పణ భావంతో చేయగలగాలి. నిజానికి భగవంతుడి సన్నిధికి వెళ్ళాల్సింది భౌతిక విషయాలకు దూరంగా, కాసేపు ప్రశాంతమైన మనసుతో ఎవరికివారు స్వామితో మౌనంగా సంభాషించు కునేందుకు. ఆయన కరుణాకటాక్ష వీక్షణాలు తమపై ప్రసరింప చేస్తున్నందుకు, జీవితంలో సుఖ సంతోషాలను నింపుతూ ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి. కోర్కెల చిట్టా విప్పడానికి కాదు.
ఎవరికి ఏది కావాలో ఆయనకు తెలుసు. మాతృగర్భం నుంచి బయటకు వచ్చేసరికి ఆహారాన్ని మాతృస్తన్యంగా ఏర్పాటు చేసిన భగవంతుడు ఎవరికి ఏది ఏ సమయంలో ప్రసాదించాలో ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. పూజామందిరంలో దేవుడి ముందు అగరొత్తులు వెలిగించడంతో పాటు ప్రేమానురాగ కుసుమ పరిమళాలతో ఇంటిని పరిసరాలను నింపుకోవాలి. దీపం వెలిగించడంతోపాటు అజ్ఞానాంధకారాన్ని పారదోలాలి. భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని నలుగురితో పంచుకోవాలి. భగవంతుడి ముందు వినయంగా శిరస్సు వంచడంతోపాటు తోటివారిపట్ల నమ్రతతో నడుచుకోవాలి. హాని తలపెట్టిన వారినీ హృదయపూర్వకంగా క్షమించగలగాలి.

దేవుణ్ని ఏం కోరుకోవాలి? నీలోని బలహీనతలను విన్నవించి వాటిని అధిగమించే శక్తిని, కష్టాలను అధిగమించే మానసిక స్థైర్యాన్ని కలిగించమని అర్థించాలి. ఆ దైవం ప్రసాదించిన తెలివితేటలు, సంపద దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే బుద్ధి కలిగించమని కోరుకోవాలి. తల ఎత్తుకొని నిర్భయంగా స్వయంశక్తితో స్వతంత్రంగా ఆత్మగౌరవంతో నిజాయతీగా జీవించే లక్షణాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. లభించిన దానితో తృప్తిపడే మనసునిమ్మని కోరుకోవాలి. అంతకు మించిన ధనం లేదు.

అర్హతను చూసి ఎవరికి ఏమి కావాలో ఎంతవరకు ఇవ్వాలో అది ఏదో రకంగా భగవంతుడు కలగజేస్తాడు. అర్హత లేకుండా దైవాన్ని ప్రార్థించడం ఇతరులను అర్థించడం కేవలం అవివేకం, అత్యాశ.
స్ఫూర్తిమంతమైన పాఠం


ప్రపంచ ప్రసిద్ధ ఫోర్డు వాహన సంస్థ అధినేత హెన్రీఫోర్డ్‌కు ఇంజిన్ల తయారీ విషయంలో ఒక సరికొత్త ఆలోచన మనసులో మెరిసింది. సంస్థ ముఖ్య సాంకేతిక నిపుణులందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. శక్తిమంతమైన కొత్త ఇంజిన్‌ గురించి తన ఆలోచనలను వివరించాడు. ఎవరికీ అది రుచించలేదు.
హెన్రీఫోర్డ్‌ వారి వాదనలన్నీ ఓపిగ్గా విన్నాడు. అందరినీ పరిశీలనగా చూశాడు. ‘ఈ తరహా ఇంజిన్‌ తయారీ కష్టసాధ్యమనే విషయం నాకూ తెలుసు. మీ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్నది నా ప్రయత్నం. ఎందుకు విఫలమవుతామన్న మీ ఆలోచనలను పక్కకు నెట్టి, ఎలా సాధించాలన్న విషయంపై దృష్టి సారించండి. సానుకూల దృక్పథంతో వెంటనే పని మొదలు పెట్టండి. విజయం సాధించి, మీ సత్తా నిరూపించుకోండి’ అని ఆదేశించాడు.
వారిలో పట్టుదల రగిలింది. అందరూ కసిగా రంగంలోకి దిగారు. ఆరు నెలలు తిరిగే సరికల్లా అమెరికా రహదారులపై వి-8 ఫార్ములా ఇంజిన్లతో శక్తిమంతమైన ఫోర్డుకార్లు పరుగులు తీశాయి. వాహనరంగంలో విజయవంతమైన వాటిలో వి-8 ప్రధాన వాహనంగా పేరు గడించింది.

సీతమ్మను అన్వేషిస్తూ వానరులు కొండాకోనా గాలించారు. చివరకు సాగరతీరానికి చేరారు. నూరు యోజనాల విస్తీర్ణంతో భీకరంగా గర్జిస్తున్న సముద్రాన్ని చూడగానే నీరుకారిపోయారు. నిరాశ ఆవరిం చింది. అందరూ దిగాలుగా కూర్చున్నారు. జాంబవంతుడు లేచాడు. హనుమంతుణ్ని సమీ పించాడు. గంభీరమైన కంఠంతో హనుమను ప్రేరేపించడం ఆరంభించాడు. ‘ఓ మహావీరా! నీవు సామాన్యుడివి కావు. బలంలో తేజస్సులో రామలక్ష్మణులకు సమానుడివి. అంతరిక్షంలో అనాయాసంగా విహరించే గరుత్మంతుడి రెక్కల్లోని అనంతమైన శక్తి నీ సొంతం. విషాద సాగరంలో మునిగిన ఈ వానర సమూహాన్ని ఉద్ధరించగల శక్తిశాలివి నీవు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడైనట్లు నీవు విజృంభించు... విక్రమించు. సముద్రాన్ని లంఘించు. సీతమ్మదర్శనం సాధించు. రామకార్యాన్ని పూర్తిచేసి, ఆ అవతార పురుషుడికి ఆనందాన్ని కలిగించు. లే... లంకకు పోయి విజయుడివై తిరిగిరా’ అంటూ పరిపరి విధాల ప్రబోధించాడు.

అంతే! జాంబవంతుడి పలుకుపలుకుతో గుండెల్లో ఉత్తేజం పొంగి ప్రవహించగా- హనుమ దేహం అంతకంతకూ పెరిగిపోయింది. ఆ సందర్భంలో వాల్మీకిమహర్షి హనుమనోట అద్భుతమైన వాక్యాలు పలికించారు. ‘నా బుద్ధి, మనసు సీతమ్మవారిని దర్శించాలన్న ఉత్కంఠతో ఉవ్విళ్లూరుతున్నాయి. లంకను పెకలించి తెస్తాను. మీరంతా నిశ్చింతగా ఉండండి’ అన్నాడాయన. అంటే మానసికంగా అప్పటికే ఆయన సీతమ్మ సమక్షంలో ఉన్నాడు. విజయం ముంగిట్లో నిలిచాడు. ఇక భౌతికమైన ప్రయాణం ఒక్కటే మిగిలింది.

వ్యక్తిత్వ వికాస తరగతిగదుల్లో నేర్పించవలసిన గొప్ప పాఠమిది. నాయకుడు తన సహచరులను ఏ రకంగా ప్రేరేపించాలో... ఆ ప్రేరణ కళను విజేత ఏ విధంగా ఆకళించుకోవాలో... పని ఆరంభించే సమయంలోనే దాని విజయాన్ని మానసికంగా ఎలా అనుభూతి చెందాలో... మహోత్సాహంతో లక్ష్యాన్ని ఎలా సునాయాసంగా సాధించాలో... రామాయణం మనకు అలవోకగా బోధించింది.
మానవ బలహీనతలు


ఆత్మస్తుతి పరనింద మనసును ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అయినా ఆ సంతోషం చిరకాలం నిలవదు. స్వల్ప విజయాలను ఘనవిజయాలుగా ప్రచారం చేసుకుంటూ తమ సుగుణాలను తామే పొగుడుకునేవారు జీవితంలో రాణించలేరు. తనంతటివాడు లేడని మిడిసిపడుతూ తనకు తానే సాటి అని భావించేవాడు అజ్ఞాని. భూమిపై నివసించే లక్షల జీవరాసుల్లో తన పాత్ర అణువంత అని గ్రహించినవాడే ఉత్తముడు. ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.

‘పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నారు. సర్వేశ్వరుడే సమస్తాన్ని నియమిస్తున్నాడని, అన్నింటికీ పరమేశ్వరుడే కర్త అని భావించేవారు బుద్ధిమంతులు. సమస్తం ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుందనే దృఢ విశ్వాసం గల వ్యక్తి తాను ఈశ్వరుడి చేతిలో పరికరమని భావిస్తాడు’ అని రామకృష్ణ పరమహంస బోధించారు. ఆత్మస్తుతి చేసుకునేవారు ఇతరుల దోషాలు ఎంచడంలో ప్రవీణులవుతారు. పరనింద మనసును ఉద్వేగపరుస్తుంది. కానీ, వారికి తమ దోషాల గురించి తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తారని భారతం చెబుతుంది.

ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. యజ్ఞం పూర్తయ్యాక చివరి రోజున భీష్ముడి సలహాపై శ్రీకృష్ణుణ్ని పూజించాలని అనుకున్నప్పుడు శిశు పాలుడు మండిపడ్డాడు. శ్రీకృష్ణుణ్ని నిందించసాగాడు. శిశుపాలుడి తల్లి కిచ్చిన మాట ప్రకారం నూరు తప్పులవరకు సహించిన శ్రీకృష్ణుడు హద్దుదాటిన వదరుబోతు తల ఖండిస్తాడు. అకారణ ద్వేషం అనర్థ హేతువు. ఇతరుల దోషాలు ఎంచుతూ సమయం వృథా చేసు కునేవారు తమ జీవితంలో ఏమీ సాధించలేరు.

అసూయా ద్వేషాలు మనిషి తోబుట్టువులు. అవి మనసును కలుషితం చేసే ఉపద్రవాలు. ఎదుటివారి ఉన్నతిని చూసి ఓర్వలేకపోవడం సంకుచిత మనస్తత్వం. అసూయ ద్వేషాన్ని రగిలిస్తుంది. పగను పెంచుతుంది. అసూయాపరుడు మానసిక వేదనకు గురవుతాడు. లోకంలో ఎవరికీ ద్వేషం కలిగించనివాడు, ఎవరివల్లా ఉద్వేగానికి గురికానివాడు, ఈర్ష్య, భయం, మనోవికారం లేనివాడు అయిన భక్తుడు తనకు ఇష్టుడని భగవంతుడి గీతోపదేశం. అసూయాపరుడు, ఇతరులను అసహ్యించుకునేవాడు, అసంతుష్టుడు, కోపి, నిత్య శంకితుడు, పరధనోపజీవి అనే ఆరుగురూ దుఃఖభాజనులని విదుర నీతి చెబుతోంది.

జీవితం సుఖసంతోషాలతో సాగిపోవడానికి చదువు, జ్ఞానంతోపాటు మనసులో మానవత్వపు పరిమళాలు వీచాలి. తోటివారికి సహాయం చేయగల సహృదయులు ఇతరుల దోషాలు లెక్కించరు. సజ్జన సాంగత్యం దుష్ట ఆలోచనలను దూరం చేస్తుంది. అసూయాద్వేషాలను మనసుకు చేరనీయదు. నిత్యం భగవన్నామ స్మరణలో పునీతులైనవారు నిర్మల మనస్కులై తమ శక్తికి లోబడి కార్యాచరణకు పూనుకొని విజయం సాధిస్తారు. తమతోపాటు ఇతరుల అభ్యున్నతినీ కోరుకుంటారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తారు.
మనిషిలో అపార శక్తి

ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలా మందికి తెలియదు. ప్రాచీన కాలంలో మహర్షులు తమ అలౌకిక అనుభవ బలంతో మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారు. నేడు దూరదర్శిని, సూక్ష్మదర్శిని, మరెంతో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నారు

భగవంతుడు ప్రతి మనిషినీ ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు. రూపం, గాత్రం, చిత్రకళ, వాక్చాతుర్యం, రచన, క్రీడలు... ఇలా ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్రత్యేకతా లేని మనిషి అంటూ ఉండడు. వాటిని గుర్తించి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేసేవారే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తనను వేధిస్తున్న మరణ భయాన్ని ప్రత్యక్షంగా పిన్న వయసులోనే అనుభవించి, తానెవరో తెలుసుకున్నారు రమణ మహర్షి. ప్రతి మనిషి ‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవాలని ప్రపంచానికి తెలియజెప్పారు.

సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు.

ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి మూడు వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవితకాలమంతా మిగిలిపోతాం. అన్ని అంగాలూ ఉండి సోమరితనంతో యాచన చేస్తూ జీవిస్తున్న ఎంతోమందికి నిక్‌ వుజిసిక్‌ ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన కాళ్లు చేతులు లేకుండా పూర్తి అంగవైకల్యంతో పుట్టాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం ప్రోత్సాహాలతో ఎన్నో రంగాల్లో ప్రత్యేకంగా రాణించాడు.


మనిషిలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏ నావా ప్రయాణం చేయని సముద్రం వంటిది. ఎవరూ సంచరించని అంతరిక్షం వంటిది. కాబట్టి ఎవరి మార్గం వారిది. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నించారు. శ్రవణ మార్గాన్ని పరీక్షిత్తు మహారాజు ఆచరించాడు. కీర్తన మార్గాన్ని వాల్మీకి, రామదాసులు ఎంచుకున్నారు. స్మరణ మార్గాన్ని ప్రహ్లాదుడు, తులసీదాస్‌ పాటించారు. పాదసేవన మార్గాన్ని భరతుడు ఆచరించాడు. వందన మార్గాన్ని కృష్ణ పరమాత్మ బోధించాడు. దాస్య భక్తికి హనుమ అంకితమయ్యాడు. సఖ్య భక్తిలో అర్జునుడు, సుగ్రీవుడు తరించారు. ఆత్మ నివేదన భక్తిని ద్రౌపది పాటించింది. అర్చన భక్తిని ప్రస్తుతం మానవులు ఆచరిస్తున్నారు.

తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించాలి. అభిరుచిని బట్టి ప్రోత్సహిస్తే వారిలో మరో బుద్ధుడు, వివేకానందుడు, అబ్దుల్‌ కలాం వంటివారు సమాజానికి దిశానిర్దేశం చేసే ప్రత్యేక వ్యక్తులుగా ఉద్భవిస్తారు.
ప్రతిక్షణం జీవించాలి

మనిషి జీవితం అమూల్యం. అది ఉత్కృష్టమైంది, దుర్లభమైందని ఎన్నో పురాణాలు పేర్కొన్నాయి. జీవించిన కాలం ఎంత అనేదానికన్నా ఎలా జీవించారు అనేది ముఖ్యం. సూర్యోదయాలు, అస్తమయాల రోజువారీ కాల చక్రం గిర్రున తిరుగు తుంది. రోజులు గడిచే కొద్దీ ఆయువు తగ్గి మృత్యువు దాపురిస్తుందన్న ఆలోచన మనిషికి రాదు. కాలం ప్రవాహ వేగంతో ప్రయాణిస్తుంది. వేగాన్ని అదుపు చేయలేం. కాలాన్ని, దాని విలువను గుర్తించి సద్వినియోగం చేసుకోవచ్చుగడచిన కాలాన్ని తలచుకుని బాధపడుతూ, రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనిషి ఎప్పుడూ గతంలోనూ, భవి ష్యత్తులోనూ బతుకుతున్నాడే కాని, వర్తమానంలో కాదు అంటారు శ్రీరమణులు. నిన్నటిరోజు తిరిగిరాదు. రేపు ఉందో లేదో తెలియదు. నేడు సత్యం. దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలి. విజయాలు సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి. సార్ధకత చేకూరాలి. కలలు కనండి, వాటిని నిజం చేసు కునేలా పరిశ్రమించాల్సింది నేడే. అందుకోసం బలమైన పునాదిని వెంటనే నిర్మించాలి. అదే భవిష్య త్తులో ఎత్తయిన భవనాన్ని భరి స్తుంది అంటారు అబ్దుల్ కలాం

చేతులు కాలాక ఆకులు పట్టు కుంటే ఏం లాభం? దేనికైనా ముందుగానే ప్రణాళిక, వివేకం, విచక్షణా జ్ఞానంతో సిద్ధం కావాలి. చికిత్సకన్నా నివారణ ముఖ్యం. జీవితం విలువ తెలిస్తే ఒక్కక్షణమైనా వృథా కాదు. కాలం గడపడం ముఖ్యం కాదు. సద్విని యోగం చేసుకోవడం ప్రధానం. 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైంది. ఏదైనా సాధించే శక్తికలది మానవ జీవితం అంటారు పెద్దలు. జననం ముందు అజ్ఞానం, మరణం తరవాత అజ్ఞానం... మధ్యలో విలువైన జీవితకాలం సుసంపన్న జ్ఞానం. ప్రతి నీటిబొట్టును భద్రపరిస్తే నీటి కరవు ఉండదు. ప్రతి క్షణాన్ని వివేకంతో గడిపితే శాశ్వత కీర్తి సొంతమవుతుంది.

జీవితం విలువ, కాలం వేగం అంచనా వేస్తే ప్రతి క్షణం సద్వినియోగమే. త్వరగా ప్రారంభించునిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకో అనేది ఆంగ్ల సామెత. రేపటి పని ఈరోజే చెయ్యి. ఇవాల్టి పని ఇప్పుడే చెయ్యి అనేది హిందీ సూక్తి. కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేయకు ప్రతిపనీ నిర్మాణాత్మకంగా ప్రతిభతో ప్రగతి వైపుగా ఉండాలని హెచ్చరిస్తారు విజ్ఞులు.

కాలాన్ని తైలధారగా వర్ణించారు. అది నిరంతరం కొనసాగే ధార. జీవితం కూడా అంతటి వేగంగా సాగుతుంది. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం.... ఒకదాని వెంట ఒకటి పరుగు పెడతాయి. ఇలా చేయలేకపోయాను, చేసి ఉంటే ఎంతో సాధించేవాణ్ని అనే నిరాశ కలగకుండా ఉండాలంటే అప్రమత్తంగా విజయాన్ని ఒడిసిపట్టాలి. ప్రతి క్షణం జీవించాలి.

హనుమ లంకలో సీత జాడ కోసం ఒక రాత్రి మొత్తం క్షణం విరామం లేకుండా వెతికాడు. అందరి మధ్య సంచరించాడు. కొంత నిరాశ ఆవహించినా ధైర్యాన్ని వీడలేదు. నిరాటంకంగా, నిర్విఘ్నంగా ప్రయత్నం కొనసాగించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. విలువైన, అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంతో తీవ్ర నిరాశతో ముగించేవారు పిరికివారు, మూఢులు. భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం మానవ జీవితం. ఆస్వాదిస్తూ అనుభవించేవారే చరితార్థులు.
జీవితం అపురూప వరం

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు.

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.

ప్రసన్నత, ప్రశాంతత, భగవత్‌ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.

జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!
జీవితం అపురూప వరం

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.

ప్రసన్నత, ప్రశాంతత, భగవత్‌ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.

జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!
ఆనంద సృష్టి

"పువ్వులను మనం సృష్టించలేం. వాటికవే పుష్పించి, వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి. నవ్వులను మనం సృష్టించుకోగలం. ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. పెద్ద పనుల్ని మనం చెయ్యలేకపోయినా చిన్నచిన్న పనులను పెద్ద హృదయంతో చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యలేకపోతున్నామని బాధ పడకూడదు. ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం.

ఆనందం, మనం చేస్తున్నది చిన్నపనా పెద్దపనా అని కొలతలు వెయ్యదు. ఎంతగా మనసు పెట్టి, హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది. ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి. బాధలు కిటికీ తెరలు. మహాద్వారం మన అంతులేని సంతోషమే. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం. చేసుకోవాలి. చెట్టును, పిట్టను, కొంగను, కోడిని చూసి మురిసిపోవాలి. కూడా ప్రతీ దృశ్యం సూర్యోదయంలా ఉండదు. ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు. చేతిలో చిన్న వెదురుముక్క కూడా, నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది. హృదయంలో సంతోషం సంతకాలుండాలి. మనసులో మంచి
జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి. ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదుఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు. మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే.

ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి. రోజంతా సంతోషంగా ఉండాలా, లేదంటే వేదనతో కాలం గడపాలా అని. ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావంపుట్టుకతో బాధలు అందరికీ ఉండవుమధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని సృష్టించు. అపరిమితంగా సృష్టించు. గడ్డిపువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మకమలాన్ని చూడగలిగే మనసును తయారుచేసుకోవాలి. బతకడానికి సిరులు-సంపదలు కాదు కావాల్సింది. పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పరితనం కావాలి. బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు. కాని, బృందావన దర్శనం అవుతుంది. అది పరమాత్మ తిరిగిన ప్రదేశం. ప్రతి మొక్క, ప్రతి పూవు, గాలి, నీరు మాట్లాడతాయి. మనసును తెరచి ఉంచుకోవాలి. అంతే!

'మనలోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే, కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్యప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు... నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా? కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుందిజీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే సాధ్యమవుతుంది. అతడే జ్ఞానిఅతడే తనకు చాలా ఇష్టమైనవాడు అంటాడు గీతాచార్యుడు. బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం భూతంలాగా కనిపిస్తుందిసంసారం సముద్రంలాగా అనిపిస్తుంది. వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది. అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకుని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలివెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్నపిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి. ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి. నవ్వుతూ అందరినీ పలకరించాలి.
మాట తీరు

మానవుడి దైనందిన జీవితంలో నిత్యావసరాలకు విషయ ప్రసారానికి ముఖ్యమైన మాధ్యమం మాట. అది భావ వ్యక్తీకరణకు మార్గం. మాటే మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. వాక్కు వ్యక్తిత్వానికి వాచక రూపంకొంతమంది ఆలోచించి మాట్లాడితే, కొంతమంది మాట్లాడిన తరువాత ఆలోచిస్తారు. దాన్ని సరి చేసుకునేందుకు నానా పాట్లు పడతారు. కాలు జారితే తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకోలేం. పెదవి దాటితే పృద్వి దాటుతుందని నానుడి. అది అక్కడితో ఆగక చిలవలు పలవలై వ్యాప్తి చెందుతుంది. అందుకే ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు. అసలు మాట్లాడవలసిన "అవసరం ఉందా అని ఆలోచించుకుని మాట్లాడాలంటారు సోక్రటీస్.

మాటల్లో ఆత్మవిశ్వాసంఆత్మీయత, నమ్మకం ఉట్టిపడాలి. విషయం సూటిగా స్పష్టంగా సందేహ రహితంగా ఉండాలి. లేకపోతే అపార్ధాలకు దారి తీసి సంబంధాలు దెబ్బతింటాయి. చిక్కుల్లో పడేస్తుందిమాటే చిక్కుల్లో నుంచి బయట పడేస్తుందిసత్య అయినా అహితాన్ని చెప్పకూడదు. హితం కదా అని అసత్యం చెప్పకూడదు. చెప్పదలచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి. వ్యవహారాల్లో అన్నదమ్ములైనా కచ్చితంగా నిర్మొహమాటంగా మాట్లాడాలిమిత్రులు సమ వయస్కులతో వ్యాఖ్యలతో సరదాగా. భార్య చతురోక్తులతో, మిత్రులతో
రసస్ఫోరకంగా, పెద్దలతో వినయంగా సూటిగా పొదుపుగా, పిన్నలతో ఆదరంగా ప్రోత్సాహకరంగా, నూతన పరిచయస్తులతో మర్యాదగా మాట్లాడాలి. అతి ఎప్పుడూ ' ఎక్కడా పనికిరాదు. మాటకు విలువ లేని చోట, మనోభావాన్ని అర్ధం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనం ఉత్తమం. మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయోమార్గం. నోటి దురుసుతనం, ఆధార రహిత అనాలోచిత నిందారోపణలు, అసూయాగ్రస్త అపవాదులు, సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. వివేచన లేని వాగ్వివాదాలు

నాయకులకు మాట శక్తిమంతమైన ఆయుధం. వంద తుపాకులు చేయలేనిది ఒక్క మాట చేస్తుంది అంటారు. మాట త్రికరణ శుద్ధిగా నిర్మల చిత్తంతో ఉన్నప్పుడు వాక్సుద్ధి కలుగుతుంది. ఆ మాట ఒక విలువశక్తి సంతరించుకుంటుందిమంచిగా, పద్దతిగా మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా తెలియాలి. మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే పునరావృతం అవుతుంది. వింటుంటే కొత్త విషయాలు, ఇతరులు అభిప్రాయాలు తెలుస్తాయి. ఏ విషయాన్నీ పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు. అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి. అంతే కాకుండా ఎదుటివారు ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే, మాట్లాడేవారి అంతరంగాన్ని చిత్తశుద్దిని కూడా గ్రహించగలగాలి. వినేటప్పుడు పెద్దల భావాలు గణనలోకి తీసుకోవాలి. | కటువుగా ఉన్నా హితుల మాటలు స్వీకరించాలి. వినే విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకుంటూ మాట్లాడే విషయం సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా, మృదువుగా, చిరునవ్వుతో వ్యక్తం చేస్తే సమాజంలో సంబంధాలు సాఫీగా సాగిపోతాయి.

శ్రీరాముడు పూర్వభాషి. స్మితభాషి, మృదుభాషి, మితభాషి. కనుక జనరంజకుడయ్యాడు. వాక్ వైభవంలో హనుమ ఆ శ్రీరాముడి ప్రశంసలు అందుకున్నాడు. అటువంటివారి మాటతీరు మనకు ఆదర్శం, అనుసరణీయం.
సంయమనం గొప్ప వరం

విద్యాధికుడిగా, జ్ఞానిగా, ప్రజోపకారిగా, బంధుమిత్ర ప్రియతముడిగా మన్ననలు పొందినా ఒకే ఒక అవలక్షణం వల్ల ఘనతను కోల్పోతున్నాడు మనిషి. రెండక్షరాల ప్రేమ మనిషిని మహనీయుణ్ని చేస్తుంటేమరో రెండక్షరాల క్రోధం అతణ్ని మతిభ్రష్టుడిగా మార్చేస్తోంది. ప్రథమకోపం, క్షణికావేశం మనిషిని పశువును చేస్తాయి. ముక్కోపానికి దాసులైన ముని పుంగవులు సైతం విజ్ఞతను దిగజార్చుకొని తపశ్శక్తిని కోల్పోయారు. నిలువెల్లా క్రోధం ఆవరించినప్పుడు చీకట్లు కమ్మి విచక్షణ నశిస్తుంది. ఆర్జించుకొన్న సద్గుణాలు, గౌరవాభిమానాలు మంటగలిసిపోతాయి. తొందరపాటు చర్య వల్ల అనర్థాలు దాపురిస్తాయి. ఇదొక మానసిక బలహీనత. పూర్వాపరాలు ఆలోచించక క్షణికావేశానికి లోనై మూర్ఖంగా విధ్వంసానికి సైతం వెనుదీయని వైఖరి మనిషి అల్పత్వాన్ని సూచిస్తుంది. ఆపై తొందరపాటు చర్యకు వగచినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఆకర్షణలకు మొగ్గుచూపి కుటుంబ బంధాలను తెంచుకొని బలవన్మరణాలకు పాల్పడే అనాలోచిత చర్యలు బాధాకరం. తమ అనైతిక ప్రవర్తనంతో మానవత్వానికి మచ్చతెచ్చి చరిత్రహీనులుగా మిగిలి పోయేవారు ఇంకొందరు.

జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏవో కొన్ని సందర్భాల్లో మందలింపులు, అవమానాలు తప్పవుభవితను దిద్దుకొనేందుకు వాటిని ఉపకరణాలుగా ఉపయోగించుకోవాలే తప్ప కోపంతో రగిలిపోకూడదుకన్నవారు, గురువులు, మిత్రులు మన ఎదుగుదలకు ప్రధాన సూత్రధారులు. మెట్టు మెట్టునా మన ఉన్నతిని కాంక్షించేందుకు పడే తాపత్రయాన్ని గుర్తించాలి. గుండెనిండుగా వారిని గౌరవించాలే గాని ద్వేషం, పగతో శత్రుభావన పెంచుకోరాదు. యాగం జరుగు తున్న సమయంలో తన రాకను గౌరవించ లేదని అల్లుడైన శివుడిపై కోపించాడు. దక్షప్రజాపతి. అనరాని మాటలతో అవమా నించాడు. ఏ మాత్రం చలించలేదు శివుడు. దక్షుడి పట్ల కొంచెమైనా విరోధం లేకుండా కూడా స్తుతిగానే స్వీకరించాడుదక్షయజ్ఞ కూర్చున్నాడు. ధ్వంసానంతరం బ్రహ్మాది దేవతలు రుద్రుణ్ని శరణువేడారు. దుష్టుల నిందవల్ల మహాత్ముల శోభ మరింత పెరుగుతుందే కాని అపకీర్తి కలగదని, అజ్ఞాని విమర్శల్ని పొగడ్తలుగా చిరునవ్వుతో స్వీకరిస్తానన్నాడు శివుడు

ప్రశాంత జీవనాన్ని అశాంతికి గురిచేసే కోపాన్ని తక్షణం నియంత్రించాలిరగులుతున్న కోపాన్ని విజ్ఞతతో కట్టడిచేసి శాంతపడేవారే ధన్యులు. కోపాన్ని అదుపుచేసి కళ్లెలు బిగించేది మౌనం. సమస్య సరళతరం కావాలంటే అననుకూల వాతావరణం నుంచి మౌనంగా నిష్క్రమించాలి. ఆవేశపరులు రెచ్చిపోయినప్పుడు బుద్ధిమంతులు మౌనాన్ని ఆశ్రయించి వారిని చల్లబరుస్తారు. ఆవేశానికి అడ్డుకట్టవేసే శక్తి ఆలోచనది కూడా. ప్రశాంతంగా క్షణకాలం బుద్ధిని ప్రయోగించి ఆలోచిస్తే చేస్తున్నది తప్పో ఒప్పో అర్థమవుతుంది. ఈ శక్తిని సొంతం చేసుకొంటే అబలల పై ఆమ్లదాడులు, నడివీధిలో గొంతులు కోనే దారుణాల్లాంటివి సంభవించవు. ధ్యానం, యోగాభ్యాసంవల్ల ఈ శక్తి లభిస్తుంది. ప్రతి ప్రాణిలో భగవంతుడి చైతన్యాన్ని గుర్తించాలిఆవేశకావేషాలకు లోనైనప్పుడు, బుద్ధి వక్రమార్గం వైపు మరలినప్పుడూ స్థిరచిత్తంతో చేసే ఇష్టదేవతా స్మరణ, ప్రార్ధనలు ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించే మహోత్కృష్ట వరాలు.
జనన మరణాల మధ్య..."

మహా బలవంతుడుమల్లయుద్ధ వీరుడైనా కాలం గడుస్తూ వయసు పెరుగుతుంటే వృద్ధుడై బలహీనపడతాడుకాలం పరుగెడుతుంటే యౌవనంలో అందాల రాశి ముసలితనంలో కళాకాంతులు పోగొట్టుకుంటుందిమహాజ్ఞాని సైతం వయసు మళ్ళాక జ్ఞాపకశక్తి తగ్గి చింతిస్తుంటాడు. జనన మరణాల మధ్య ప్రతి ఒక్కరూ దేహంలో మార్పులకు తలవంచవలసిందే

గడిచిన క్షణం తిరిగిరాదుఈ నిజాన్ని జీర్ణించుకున్న విజ్ఞులు నేను నాది అనే జహంకారాన్ని తలకెక్కించుకోరు. స్వార్థాన్ని కట్టడి చేసుకుని సన్మార్గంలో జీవనయానం సాగిస్తారుతమకు తెలియని ఏదో శక్తి తమను నడిపిస్తోందని విశ్వసిస్తారుఆ శక్తినే దైవంగా భావిస్తారుతను జీవితం అ దైవలీలకు లోబడిందని గ్రహిస్తారుఈ జగతిని సృష్టించి పాలిస్తున్న పరమేశ్వరుడిని వినమ్రంగా సేవిస్తూ కృతజ్ఞులై ఉంటారుపరమేశ్వరుడి సృష్టిలో అత్యంత కీలకమైనది మాటపుట్టిన వెంటనే మాట రాదుమరణ సమయంలో మాట పడిపోతుందిమధ్యకాలంలో సత్య సంభాషణం మనిషి విలువను వెంచుతుందికష్టసుఖాల్లో పాలుపంచుకునే బందుమిత్రులను ఆదరించినవారి జీవితం ఆనందమయమవుతుందిస్నేహబంధ వ్య పరిమళాలను నిరంతరం ఆస్వాదించాలి. జనన మరణాల మధ్య కాలంలో లోటి మోహాలనుమదమాత్సర్యాలను మనసునుంచి తరిమికొట్టి మంగళకరమైన ఆలోచనలతో మనసును పరిపూర్ణం చేసుకుంటే జీవనం ఉత్సాహభరితమవుతుంది చెడుతలపులకు తలుపులు తెరిస్తే చివరి రోజులు దుఃఖమయమే. భూమి మీద పడగానే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగదుముసలితనంలో యమ భటులు వాకిట ముందుకొచ్చినప్పుడు రోగంతో గొంతు పూడుకుపోయి భగవంతున్ని తలచగలమో లేదోభజింపగలమో లేదో తెలియదుకనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుణ్ని ద్యానించి పూజించాలని బోధిస్తుంది దాశరథీ శతకపద్యంభూమి

జీవితంలో ప్రతిక్షణం విలువైనదని తెలుసుకోగలగాలిఅనుక్షణం అప్రమత్తంగా ఉండాలిసోమరితనంతో కాలాన్ని వృదా చేసుకునేవారు అజ్ఞానులు.

మనసులో రూపుదిద్దుకొన్న ఆలోచనలను తక్షణం ఆచరణలో పెట్టడం ఉత్తముల లక్షణంతమతోనే నిక్షిప్తమైపోకుండా తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేవారే విజ్ఞులు, నిర్దేశించుకున్న లక్ష్యాలను కాలయాపన చేయకుండా పట్టుదలతో సాధించేవారు మార్గదర్శకులై ప్రకాశిస్తారుకదలలేని స్థితిలో చేసిన తప్పులు తలచుకుంటూ కన్నీరు కార్చే పరిస్థితి కల్పించుకోకూడదుచివరి క్షణంలో నిర్మలమైన మనసుతో భగవంతుడనుగ్రహించిన జీవితాన్ని సార్ధకం

చేసుకున్నామన్న తృప్తితో ఆనందంగా పరమేశ్వరుడి పిలుపునందుకోవాలి
ఆధ్యాత్మికానందం

సంతృప్తిప్రశాంతత, మానసికానందం... ఇటువంటి గుణాలున్నవారి జీవితం పరిపూర్ణమవుతుందిఎవరికి వారే ఆధ్యాత్మికంగా ఎదిగితేనే అది సాధ్యపడుతుందిఆధ్యాత్మికత అనే పదానికి ఆత్మీయంగా దగ్గర కావడమని అర్థం. ఆ స్థితికి చేరాలంటే నిత్యజీవన సరళికి మానవీయ విలువలు జతపడాలిఆలోచనల్లో వైరాగ్యం చోటుచేసుకోవాలిఆచరణలో ఆదర్శం ఉండాలిఅలాగైతేనే ఇహంలో మానవుడికైనా, పరంలో మాధవుడికైనా దగ్గర కాగలుగుతారుఅలా కాకుండా ఎదుటివారు ఆపదలో ఉన్నాతమకేమీ పట్టనట్టు ప్రవచనాలు వింటూనో, స్తోత్రాలు చదువుకుంటూనో, జపమాల తిప్పుకొంటూ కూర్చోవడమో చేస్తే... అది ఆధ్యాత్మికత అనిపించుకోదు

బాధల్లో, కష్టాల్లో ఉన్నవాళ్లను తేరుకోలేని ఇబ్బందుల్లో ఉన్నవారిని చూస్తూ... అయ్యో పాపం అని జాలిపడటమో ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు... లాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి బదులు వాళ్లను ఆ స్థితి నుంచి తప్పించి స్వస్థత చేకూర్చడానికి పూనుకోవాలిరొట్టెను దొంగిలించి నవాడి నేరాన్ని చూసి నిందించడం, శిక్షించాలనుకోవడం సరైన పని కాదు. పని చెయ్యడానికి పురిగొల్పిన పరిస్థితుల్ని తెలుసుకుని సరిదిద్దగల గాలిఇది సామాజిక ఆధ్యాత్మికత అంటారు ప్రవక్తలు

అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనదంటారుమాట్లాడగలగడం వల్లనే అలా అని ఉంటారు. కానీ తరచి చూస్తే పశుపక్ష్యాదుల్లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాటి ప్రాణికి సాయపడటం, ఆపదలో ఆదుకోవడంఅండగా నిలబడటం, ఆసరా కావడం లాంటివిపశుపక్ష్యాదుల్లో జన్మతః వచ్చే లక్షణాలుఒక కాకి మరణిస్తే ఎన్నో కాకులు చుట్టూ చేరతాయి. ఒక చీమ చనిపోతే మరో చీమ మోసుకుపోతుంది. ఒక పక్షి పెట్టిన గుడ్డును మరో పక్షి పొదిగి పిల్లల్ని చేస్తుంది. అలా చేసినందుకు అవి ఏ ప్రతిఫలాన్ని ఆశించవుకానీ బుద్ధిజీవి అనిపించుకున్న మానవుడు అలాంటి సేవలు చెయ్యాలంటే ప్రత్యేకంగా అలవాటు చేసుకోవాలి. లేదా ఇతరులెవరైనా ప్రేరణ కలిగించాలిఈ రెండూ కాకపోతే ఆ పని చెయ్యడం వల్ల కొంత ప్రతిఫలమైనా ఉండాలి. ఇది ఎంతవరకు సమంజసమో ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలిఉత్కృష్టమైంది అనిపించుకున్న మానవజన్మ కలిగినందుకు అందరికీ ఉపయుక్తమైన పనులు చెయ్యడానికి శ్రద్ధ చూపాలిదీన్ని బాధ్యతాయుత ఆధ్యాత్మికత అంటారు.

చెల్లాచెదురుగా ఉన్నవాటిని క్రమపద్ధతిలోకి తేవడాన్ని సంస్కరించడం అంటారు. దాని రూపమే సంస్కృతి. అది కలిగి ఉండటం సంస్కారం. ప్రవర్తన, నడవడిక, ఆలోచనచేసే పని తదితరాలన్నింటినీ క్రమబద్ధీకరించడమే సంస్కృతికి నిదర్శనం

భగవంతుడి నివేదన కోసం భక్ష్యాన్ని తీసుకుని వెళుతున్న వ్యక్తికిఆకలితో అలమటిస్తున్న ప్రాణి ఎదురైతే భక్ష్యాన్ని ఎలా వినియోగించాలో తేల్చుకోగలగడమే సంస్కారానికి ఉదాహరణ. దీన్ని స్థితప్రజ్ఞతో కూడిన ఆధ్యాత్మికత అంటారుఇలా... ఎవరికి వారు చేసే పనులు, వాటి స్థాయిని బట్టి మంచివారుగొప్పవారుమహానుభావులు, రుషుల యుగపురుషులుగా అలరారుతారుఎన్ని ఆటంకాలెదురైనా వారు స్థిరమైన మనసుతో పదిమందికీ పనికి వచ్చే పనులనే చేస్తారు. వారు పొందేది, వారు అందరికీ అందించేదీ ఆధ్యాత్మిక ఆనందం.
2024/07/14 21:15:34
Back to Top
HTML Embed Code: