DEVOTIONAL Telegram 1046
కీర్తి సంపాదన

కుండలను పగలగొట్టి అయినాసరే, బట్టలను చించుకొని అయినా సరే, గాడిదలా అరచి అయినా సరే, ఏదో ఒకవిధంగా అందరి దృష్టినీ ఆకర్షించే మనుషులు లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు అన్నాడు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది. అందరూ తననే చూడాలని, తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తాడు. ఇది అతడి బలహీనత. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడం కష్టం కనుక, చెడుపనులను అయినా చేసి ఏదో విధంగా అందరి కళ్లలో పడితే, తమకు విస్తృత ప్రచారం లభిస్తుందనుకుంటారు కొందరు.

బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడం కీర్తికండూతి అవుతుంది. కండూతి అంటే దురద. కీర్తి సంపాదన అనేది సహజసుందరంగా లభించేది అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది. బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఇతరులకు కాదు. లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తికోసం తపించలేదు. తాము నమ్మిన మంచిపనులను చేసుకుంటూ పోయారు. అలాంటివారు ఏదీ ఆశించకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. వారికి కీర్తిపై ఆసక్తి లేదు.

మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే ఒకసారి కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవడం అనేది ఒక పరీక్ష వంటిది. వచ్చిన కీర్తిని నిలుపుకోవడం కోసం శ్రమించవలసి వస్తుంది. ఇదంతా ఒక లంపటం కనుక కీర్తి కాంక్ష లేకుంటేనే మంచిదని వారు ఆశిస్తారు. కీర్తి కాంక్ష ఒక వ్యసనమే అని పెద్దల మాట. వ్యసనం మంచిదైనా, చెడుదైనా మనిషిని వెంటాడుతుంది. నిత్యం అశాంతికి గురి చేస్తుంది.

పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంత రాజులదాకా ఎందరో కీర్తికోసం తపించేవారు. దానశీలురుగా ప్రఖ్యాతిని పొందాలనుకొన్నవారు కొందరైతే, వీరాధివీరులుగా కీర్తిని గడించాలని కోరుకున్నవారు కొందరు.

నిత్యం ఎదుటివారిని పొగుడుతూ పబ్బం గడిపేవారు కొందరైతే, తాము ఇతరులను పొగిడి, ఇతరుల వల్ల పొగడ్తలను ఆశించేవారు కొందరు. ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మసంతృప్తిని పొందేవారెందరో కనిపిస్తారు. ఇలాంటివారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు- ‘ఒంటెల పెళ్ళికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ ఆహా! ఏమి మీ అందం? వర్ణనాతీతం’ అని పొగిడాయట. వెంటనే ఒంటెలు ఊరకుంటాయా? ‘ఓ మిత్రులారా! ఆహా! ఏమి మీ కంఠధ్వని... ఎంత మధురంగా ఉందో?’ అని ప్రశంసించాయట.

కీర్తికాంక్ష, కీర్తికండూతి... ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపం ఒక్కటే! ఒక రూపాయి దానం చేసి, వేయి రూపాయల కీర్తిని కాంక్షించేవారు కొందరైతే, కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు కొందరు! వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బతకాలి. ఎన్నో చేసినా, చేసింది అణుమాత్రమే అనుకోవడం మంచిది. నిజం కూడా అదే. మనిషి కీర్తికాముకుడు కాకూడదు. సహజ కీర్తి కిరీటధారి కావాలి!

tgoop.com/devotional/1046
Create:
Last Update:

BY Devotional Telugu

Share with your friend now:
tgoop.com/devotional/1046

View MORE
Open in Telegram

Telegram News

Date: |

Hashtags Telegram offers a powerful toolset that allows businesses to create and manage channels, groups, and bots to broadcast messages, engage in conversations, and offer reliable customer support via bots. Telegram Android app: Open the chats list, click the menu icon and select “New Channel.” Hashtags are a fast way to find the correct information on social media. To put your content out there, be sure to add hashtags to each post. We have two intelligent tips to give you: Today, we will address Telegram channels and how to use them for maximum benefit.
from us

Telegram Devotional Telugu
FROM American